పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాదారులు కూడా తమ ఖాతాలోని బ్యాలెన్స్‌పై రుణం తీసుకోవచ్చు. వారు తక్కువ వడ్డీ రేట్లకు ఈ రుణాన్ని పొందుతారు. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టకుండా స్వల్పకాలిక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమం. ఈ పథకం అత్యంత ప్రయోజనకరమైన లక్షణాలలో ఒకటి రుణ సౌకర్యం. రుణం చాలా సులభంగా లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతా నుంచి రుణం పొందే సదుపాయాన్ని వివరంగా తెలుసుకుందాం.
ఎవరు PPF లోన్‌కు అర్హులు.
ఖాతాదారులు PPF ఖాతాను తెరిచిన మూడు, ఆరు ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ రుణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఖాతాని తెరిచినట్లయితే 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1, 2018 నుండి రుణాన్ని తీసుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి వరకు రుణం తీసుకోవచ్చు.
ఏడో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఖాతాను పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒకరు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న సంవత్సరానికి ముందు రెండో ఆర్థిక సంవత్సరం చివరిలో రుణ మొత్తం బ్యాలెన్స్‌లో 25% ఉంటుంది.
పీపీఎఫ్ ఖాతాలో వచ్చే వడ్డీ కంటే ఒక శాతం ఎక్కువగా రుణంపై వడ్డీ వసూలు చేస్తారు. అందువల్ల, PPF పథకంలో వడ్డీ రేటు మారినప్పుడు, దాని కోసం రుణం వడ్డీ రేటు కూడా మారుతుంది.
PPF ఖాతాపై రుణం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
మీ PPF ఖాతాపై రుణం తీసుకునేటప్పుడు మీరు ఏ ఆస్తిని తాకట్టు పెట్టనవసరం లేదు.
36 నెలల రీపేమెంట్ కాలవ్యవధి – 36 నెలల వ్యవధిలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఈ గడువు రుణం కేటాయించిన నెల తర్వాతి నెల మొదటి రోజు నుండి లెక్కిస్తారు.
ఇది PPFపై రుణం తీసుకోవడం అతిపెద్ద ప్రయోజనం. ఇందులో బ్యాంకుల నుంచి లభించే వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
రుణం మొత్తాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు.
Read Also.. Edible Oil Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్.. మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు