కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1, 2023 నుంచి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మినహా అన్ని పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. తదనంతరం, చాలా మంది ప్రజల దృష్టి 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వైపు మళ్లింది. ఇది సురక్షితమైనది, హామీ కూడా వంద శాతం ఉంటుంది. ఇంకా చిన్న పెట్టుబడిదారులు ఇష్టపడే అత్యంత సాధారణ ఆదాయ వ్యూహాలలో ఇది ఒకటి.
గ్యారెంటీ ఆదాయాన్ని కోరుకునే వ్యక్తులకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమ ఎంపిక. ఏప్రిల్ 1, 2023 నుండి, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లోన్‌లపై వడ్డీ రేటు సంవత్సరానికి 7 నుంచి 7.5 శాతానికి పెంచారు.
మీరు 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలవ్యవధి కోసం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలలో పెట్టుబడి పెట్టవచ్చు. టైమ్ డిపాజిట్ మెచ్యూరిటీ తర్వాత కూడా పథకాన్ని ఒక సంవత్సరం పాటు కొనసాగించవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌తో ఖాతా తెరవడానికి కనీసం రూ.1000 డిపాజిట్ చేయాలి.
ఎవరైనా 7.5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే, వారికి వడ్డీగా రూ.2,69,969 వస్తుంది. పెట్టుబడి మెచ్యూర్ అయినప్పుడు మొత్తం రూ.8,69,969 లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..