
నేటి కాలంలో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవడంతో పాటు మంచి రాబడిని ఆశించే వారి కోసం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తరహాలోనే పనిచేసే ఈ పథకం, ప్రభుత్వ గ్యారెంటీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణంగా బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కంటే పోస్ట్ ఆఫీస్ టీడీ రేట్లు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక వరం. ఈ పథకంలో మీరు 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితితో పెట్టుబడి పెట్టవచ్చు.
భారత తపాలా శాఖ ప్రస్తుతం వివిధ కాలపరిమితులపై అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
ఒకవేళ మీరు 5 సంవత్సరాల కాలపరిమితి గల పోస్ట్ ఆఫీస్ టీడీ పథకంలో రూ.2,00,000 ఒకేసారి డిపాజిట్ చేశారనుకుందాం. ప్రస్తుతమున్న 7.5శాతం వడ్డీ రేటు ప్రకారం..5 ఏళ్ల తర్వాత వచ్చే వడ్డీ రూ.89,990 గా ఉంటుంది. *మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.2,89,990 మీ చేతికి అందుతుంది. అంటే కేవలం ఐదేళ్లలో మీ డబ్బుపై దాదాపు రూ.90 వేల లాభం వస్తుందన్నమాట. ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడి కోరుకునే వారికి ఇది సరైన వేదిక.
బ్యాంకులలో సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 0.50శాతం అదనపు వడ్డీ ఇస్తారు. కానీ పోస్ట్ ఆఫీస్ టీడీలో అన్ని వయస్సుల వారికి ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే యువకులు కూడా సీనియర్ సిటిజన్లతో సమానంగా 7.5శాతం వడ్డీని పొందే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం హామీ ఉండే ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారు వెంటనే మీ సమీప పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.