Post Office Scheme: పోస్ట్‌ ఆఫీసులో అద్భుతమైన పథకం.. నెలకు రూ.4,950 ఆదాయం..!

|

Jul 18, 2022 | 3:04 PM

Post Office Scheme: పోస్టాఫీసులలో మెరుగైన రాబడిని అందుకునేందుకు రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు బ్యాంకులతో పాటు..

Post Office Scheme: పోస్ట్‌ ఆఫీసులో అద్భుతమైన పథకం.. నెలకు రూ.4,950 ఆదాయం..!
Post Office Scheme
Follow us on

Post Office Scheme: పోస్టాఫీసులలో మెరుగైన రాబడిని అందుకునేందుకు రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు బ్యాంకులతో పాటు పోస్టల్‌ శాఖలో ఉన్నాయి. పొదుపు పథకాల్లో మంచి లాభాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందుకోవాలంటే పోస్టాఫీసుల్లో వివిధ రకాల స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ (MIS) పథకం ఒకటి. డబ్బును ఆదా చేసి, తమ రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని చూస్తున్న వారికి ఇది మంచి ఎంపికనే చెప్పాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఆదాయం పొందాలంటే పోస్టాఫీసులోని ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ స్కీమ్‌లో పెట్టుబడిదారులకు 6.6 శాతం రాబడి పొందవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా సరే పోస్ట్‌ ఆఫీస్‌ నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అకౌంట్‌ కేవలం వెయ్యి రూపాలతో తీయవచ్చు. మీరు వెయ్యి రూపాయల నుంచి ఖాతాను ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఇక్కడ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో జాయింట్‌ అకౌంట్‌ కూడా తీయవచ్చు. ఒక వ్యక్తి ఏకకాలంలో గరిష్టంగా మూడు ఖాతాలను తీయవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి ఒకే ఖాతాకు రూ.4.5 లక్షలు, ఉమ్మడి ఖాతాలకు రూ.9 లక్షలు ఉంది. ఒక వ్యక్తి MISలో గరిష్టంగా రూ. 4.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ ఖాతాలో ఇద్దరు ఉన్నట్లయితే ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.4.5 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ MIS (POMIS) వార్షిక వడ్డీ రేటు 6.6 శాతం అందిస్తుంది. ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం 5 ఏళ్లకు లాక్‌-ఇన్ వ్యవధితో వ‌స్తుంది. పెట్టుబ‌డి మెచ్యూర్ అయిన త‌ర్వాత నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

9 లక్షల పెట్టుబడి ద్వారా నెలకు 4950 రూపాయలు:

ఇవి కూడా చదవండి

ఈ పోస్టాఫీసు పథకంలో సంవత్సరానికి 6.6% వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు తర్వాత మీకు హామీ నెలవారీ ఆదాయం లభిస్తుంది. జాయింట్ ఖాతాలో ఏకంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే. 5 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఈ వడ్డీ రేటుతో ఈ మొత్తంపై రూ. 59,400 అవుతుంది. అంటే నెలకు వడ్డీ దాదాపు రూ.4,950 అవుతుంది. ఈ విధంగా, మీరు ప్రతి నెలా రూ.4,950 పొందుతారు. ఒకే ఖాతా నుంచి రూ.4.50 లక్షలు డిపాజిట్ చేస్తే నెలవారీ వడ్డీ రూ.2475 అవుతుంది.

తిరిగి పెట్టుబ‌డి పెట్టవ‌చ్చు. అయితే ఇది ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. పోస్ట్ ఆఫీస్ MIS ఖాతాను తెరవడానికి, మీరు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. ఇంకా మీరు ఆధార్, ఓటర్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, చిరునామా రుజువు వంటి గుర్తింపు రుజువుతో సహా ప్రాథమిక పత్రాలను అందించాలి. MIS ఖాతాను తెరవాలనుకునే ఆసక్తిగల పెట్టుబడిదారులు ఖాతా తెరవడానికి కనీస మొత్తం రూ. 1,000 అని గుర్తుంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి