Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ.1.03 కోట్ల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

|

Nov 07, 2021 | 6:00 AM

Post Office Scheme: ఎలాంటి రిస్క్‌ లేకుండా ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలున్నాయి. వివిధ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మెచ్యూరిటీ తర్వాత అధిక..

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ.1.03 కోట్ల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు
Follow us on

Post Office Scheme: ఎలాంటి రిస్క్‌ లేకుండా ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలున్నాయి. వివిధ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మెచ్యూరిటీ తర్వాత అధిక లాభాలు పొందవచ్చు. ఆధిక సంపాదన కోసం ఆరాటపడేవారికి ఓ మంచి ఆప్షన్‌ అందుబాటులో ఉంది. పెట్టుబడిదారుల కోసం పోస్టాఫీసులో ఈ అదిరిపోయే ఆప్షన్ ఉంది. ఇందు కోసం పోస్టాఫీస్ సేవింగ్స్ ప్లాన్ ప్రకారం.. మెచ్యూరిటీ వ‌చ్చిన త‌ర్వాత భారీ మొత్తంలో రిట‌ర్న్స్ సొంతం చేసుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ గ‌డువు ఉంటుంది. మీరు దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో పొదుపు చేయడం మేలు.

పోస్టాఫీసు సేవింగ్స్‌ స్కీమ్‌లపై వార్షిక ప్రాతిపదికన 7.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. పీపీఎఫ్‌ పథకం 15 ఏళ్ల వరకు అటుపై మరో ఐదేళ్ల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది. దీనిపై మీరు మంచి బెనిఫిట్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌లో చేరినట్లయితే గరిష్టంగా ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఏడాదికోసారి ఇన్వెస్ట్‌ చేయడం కంటే నెలవారీగా రూ.12,500 చెల్లించాలి. దీనికి ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు 15 ఏళ్లలో రూ.22.5 ల‌క్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీరు రూ.18 లక్షల వడ్డీ పొందవచ్చు.

స్కీమ్‌ వివరాలు:
15 ఏళ్ల మెచ్యూరిటీతో నెలకోసారి ప్రీమియం రూ.12,500 చెల్లించాలి. సంవత్సరానికి ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.1.50 లక్షలు. ఇక 15 సంవత్సరాలలో మొత్తం రూ.22.50 లక్షలు అవుతుంది. ఇందు కోసం వార్షిక వడ్డీ 7.1 శాతం చొప్పున మెచ్యూరిటీ మొత్తం రూ.40.70 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ మొత్తాన్ని పరిశీలిస్తే రూ.18.20 లక్షలు అవుతుంది. అలాగే ఒక వేళ మీరు 25 సంవత్సరాల పాటు డిపాజిట్‌ చేసినట్లయితే.. ఏడాది మొత్తం ఇన్వెస్ట్‌ రూ.1.50 లక్షలు. ఇక వార్షిక వడ్డీరేటు 7.1 శాతం ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తం రూ.1.03 కోట్లు అవుతంది. ఇక వడ్డీ బెనిఫిట్‌ రూ.62.50 లక్షల వరకు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Sugar Price: అక్కడ పెట్రోల్‌ కంటే చక్కెర ధర రికార్డ్‌ స్థాయిలో.. కిలో పంచదార రూ.150

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..