Post Office Saving Shemes: సీనియర్‌ సిటిజన్‌ కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే పథకం.. వడ్డీ రేటు ఎంతంటే..

|

Jun 20, 2022 | 7:34 AM

ప్రస్తుతం స్టాక్‌ మార్కె్‌ట్‌లో అనిశ్చిత కారణంగా పెట్టుబడిదారులు సురక్షింతంగా ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. అలాంటి సురక్షితమైన పథకాలలో పోస్టాఫీస్‌ పథకాలు ఉన్నాయి...

Post Office Saving Shemes: సీనియర్‌ సిటిజన్‌ కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే పథకం.. వడ్డీ రేటు ఎంతంటే..
Post Office
Follow us on

ప్రస్తుతం స్టాక్‌ మార్కె్‌ట్‌లో అనిశ్చిత కారణంగా పెట్టుబడిదారులు సురక్షింతంగా ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. అలాంటి సురక్షితమైన పథకాలలో పోస్టాఫీస్‌ పథకాలు ఉన్నాయి. మీరు ఈ పథకాలలో కచ్చితంగా మంచి రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. బ్యాంకు డిఫాల్ట్ అయితే, మీరు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో మాత్రం అలా కాదు. ఇది కాకుండా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మంచి పథకంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం, పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది. ఈ పథకంలో వడ్డీ మొదటిసారిగా మార్చి 31, సెప్టెంబరు 30 లేదా డిసెంబర్ 31న చెల్లిస్తారు. ఆ తర్వాత వడ్డీని మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 తేదీల్లో చెల్లిస్తారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఖాతాలో మినిమమ్ రూ. 1000 డిపాజిట్ మాత్రమే చేయాలి. పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలకు మించకూడదు. పోస్టాఫీసులోని ఈ చిన్న పొదుపు పథకంలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా, 55 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగి కూడా పథకంలో ఖాతాను తెరవవచ్చు. అయితే, రిటైర్‌మెంట్ బెనిఫిట్‌లను అందుకున్న నెలలోపు పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో 50 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన తేదీ నుంచి ఒక నెల వ్యవధిలో వాటిని పూర్తి చేయాలి. ఖాతాను వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి తెరవవచ్చు. ఉమ్మడి ఖాతా మొత్తం మొదటి ఖాతాదారుకు మాత్రమే చెందుతుంది. ఈ చిన్న పొదుపు పథకంలో ఖాతాను తెరిచిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధి తర్వాత మూసివేయవచ్చు. దీని కోసం, వ్యక్తి సంబంధిత పోస్టాఫీసులో తగిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మరణించిన తేదీ నుండి పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా వడ్డీ ఖాతాపై జమ అవుతుంది.