Post Office: పోస్టాఫీసులోని ఈ ఖాతా గురించి మీకు తెలుసా..? ప్రతి పైసా సురక్షితం..

|

Jan 24, 2022 | 8:26 AM

Post Office: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని

Post Office: పోస్టాఫీసులోని ఈ ఖాతా గురించి మీకు తెలుసా..? ప్రతి పైసా సురక్షితం..
Savings
Follow us on

Post Office: మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అంతేకాదు మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. అంతేకాదు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పోస్టాఫీసు పొదుపు ఖాతా కూడా ఒకటి. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాపై 4.0 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఈ వడ్డీ రేటు వ్యక్తిగత, ఉమ్మడి ఖాతాలకు కూడా వర్తిస్తుంది. ఈ పోస్టాఫీసు పథకంలో ఖాతా తెరవాలంటే కనీసం రూ.500 ఉంటే చాలు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఒక వయోజనుడు లేదా ఇద్దరు పెద్దలు కలిసి తెరవగలరు. ఇది కాకుండా మైనర్ తరపున సంరక్షకుడు ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

పథకం లక్షణాలు

1. పోస్టాఫీసు పొదుపు పథకంలో ఒక వ్యక్తి ఒకే ఖాతాను మాత్రమే ఓపెన్ చేయగలడు.

2. మైనర్ లేదా 10 ఏళ్లు పైబడిన వ్యక్లులు కూడా వారి పేరిట ఒక ఖాతాకి మాత్రమే అనుమతి ఉంటుంది.

3. జాయింట్ హోల్డర్ మరణించిన సందర్భంలో జీవించి ఉన్న హోల్డర్ ఏకైక హోల్డర్. ఒకవేళ జీవించి ఉన్న వ్యక్తిపై ఇప్పటికే ఖాతా ఉంటే అప్పుడు జాయింట్ ఖాతాను మూసివేయాలి.

4. పోస్టాఫీసులో సింగిల్‌ను జాయింట్ అకౌంట్‌గా లేదా జాయింట్‌ని సింగిల్ అకౌంట్‌గా మార్చడం సాధ్యం కాదు.

5. ఈ పథకంలో ఖాతా తెరిచే సమయంలో నామినేషన్ తప్పనిసరి.

6. మైనర్ మేజర్ అయిన తర్వాత ఖాతా తన పేరుపై మార్చుకోవడానికి సంబంధిత పోస్టాఫీసులో కొత్త ఖాతా ప్రారంభ ఫారమ్‌తో పాటు KYC పత్రాలను సమర్పించాలి.

7. ఈ పథకంలో కనీసం 50 రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

8. గరిష్ట డిపాజిట్‌కి పరిమితి లేదు.

Sleep Mistakes: మీరు బాగా నిద్రపోవాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..?

Rose Flower Farming: గులాబీల సాగుతో రైతుల ఆదాయం మెరుగు.. చిన్న పట్టణాల్లో కూడా మంచి లభాలు..

Carrot Soup: చలికాలంలో వేడి వేడి క్యారెట్‌ సూప్.. ఆరోగ్యంతో పాటు అదిరే రుచి..