Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్ శాఖ ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. బ్యాంకులు, ఇతర సంస్థలు అందిస్తున్న సేవలలాగే మెరుగైన సేవలు అందిస్తోంది పోస్టల్ శాఖ. సామాన్యుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు పలు రకాల స్కీమ్‌లలో మంచి రాబడి పొందే విధంగా ప్రణాళికలు రూపొందించింది. డబ్బులు పొదుపు చేసే పథకాలు చాలా ఉన్నాయి. ఇక పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న అనేక పథకాలలో రికరింగ్ డిపాజిట్. ఎలాంటి రిస్క్ ఉండదు. మంచి లాభం ఉంటుంది. పోస్టాఫీస్ అందించే స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి అని చెప్పాలి. ఇందులో డబ్బులు పెడితే మంచి రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని ఆయినా డిపాజిట్ చేస్తూ వెళ్లవచ్చు. ప్రతి నెల డబ్బులు పెడుతూనే ఉండాలి. పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్ గడువు సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకోసారి మీ అకౌంట్‌లో జమ చేస్తూనే ఉండాలి. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. స్కీమ్ కొనసాగుతున్న సమయంలో వడ్డీ రేటు తగ్గొచ్చు లేదా.. పెరగవచ్చు.. లేదంటే అలానే స్థిరంగా కొనసాగవచ్చు.
అయితే పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో చేరిన వారు నెలకు రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్ల తర్వాత మీ చేతికి ఏకంగా రూ.16 లక్షలకు పైగా వస్తాయి. ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. కచ్చితమైన బెనిఫిట్ ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరవచ్చు. కచ్చితమైన లాభం వస్తుంది. అయితే మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి మీ డబ్బులు మీకు వడ్డీతో సహా చెల్లిస్తారు. అవసరం అనుకుంటే మరో ఐదేళ్లు స్కీమ్ గడువు పొడిగించుకోవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే ఈ స్కీమ్‌లో చేరిన వారు క్రమం తప్పకుండా నెలవారీగా డిపాజిట్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ సమయానికి డిపాజిట్ చేయడంలో విఫలమైతే, ప్రతి నెలా ఒక శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా కారణంతో వరుసగా నాలుగు నెలల పాటు డబ్బులు జమ చేయకపోతే అకౌంట్‌ను మూసివేస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి ఇలాంటి పొదుపు పథకాలు ఉపయోగపడతాయి. ఇలాంటి సేవింగ్స్ స్కీమ్స్‌లో నెలనెలా కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా కొన్నేళ్లలో మీ డబ్బులకు వడ్డీ కూడా కలిపి భారీగా రిటర్న్స్ వస్తాయి. అయితే స్కీమ్‌లలో చేరే ముందు అందుకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోవడం తప్పనిసరి.
ఇవీ కూడా చదవండి: Train Ticket Cancellation: రైలు టికెట్ రద్దు చేసుకుంటున్నారా..? డబ్బులు ఆదా చేయడానికి ఈ విషయాలు తెలుసుకోండి..!