
చాలా మంది బాగా డబ్బు సంపాదించాలని, లక్షాధికారులు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. కానీ, కలలు కంటే కాదు కష్టపడితే నిజం అవుతాయి. చిన్న ఉద్యోగం చేస్తూ.. తక్కువ జీతంతో కూడా మీరు లక్షాధికారులు అవ్వొచ్చు అంటే నమ్ముతారా? అది కూడా ఒక్క ఏడాదిలో. అలా ఎలా అవ్వొచ్చో ఇప్పుడు చూద్దాం..
ఒక సంవత్సరంలో మిమ్మల్ని లక్షాధికారిని చేసే చిన్న పొదుపు పథకాలలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పోస్టాఫీసు POMIS పథకాన్ని అందిస్తుంది, దీనిలో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా గణనీయమైన వడ్డీని పొందవచ్చు.
18 ఏళ్లు పైబడిన ఏ వయోజనుడైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ POMIS పథకం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ POMIS పథకంలో ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే, మీకు సంవత్సరానికి రూ.1.11 లక్షల వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని సంవత్సరంలోని 12 నెలలకు అనుగుణంగా 12 భాగాలుగా విభజించినట్లయితే, మీకు నెలకు రూ.9,250 వడ్డీ లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి