Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.5 వేలు..!

| Edited By: Ravi Kiran

Dec 06, 2021 | 6:36 AM

Post Office Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. రాబడి పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లో పలు పథకాలను ప్రవేశపెట్టింది..

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.5 వేలు..!
Follow us on

Post Office Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. రాబడి పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లో పలు పథకాలను ప్రవేశపెట్టింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా ఈ పథకాలను పొందుపర్చారు. ఈ స్కీమ్‌లలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల ఎలాంటి రిస్క్‌ ఉండదు. అందుకే చాలా మంది స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌లలో డబ్బులు పెడుతుంటారు. ఇక పోస్టల్‌ శాఖలో ప్రవేశపెట్టిన పథకాలలో మంత్లీ స్కీమ్‌ ఒకటి. ఇందులో చేరి డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ప్రతి నెల, మూడు నెలలు, ఆరు, ఏడాది చొప్పున డబ్బులు పొందవచ్చు. కానీ ఒకేసారి డబ్బులను ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ మంత్లీ స్కీమ్‌లో చేరితో దీని మెచ్యూరిటీ కాలపరిమితి ఐదు సంవత్సరాలు. అయితే ఇందులో డబ్బులు పెట్టినట్లయితే ఐదు సంవత్సరాల వరకు ఆగాల్సి ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రతి నెలా వడ్డీ వస్తూనే ఉంటుంది. ఈ స్కీమ్‌లో రూ.1000 నుంచి డబ్బులు పెట్టే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. అదే జాయింట్‌ అకౌంట్‌ తీసుకున్నట్లయితే రూ.9 లక్షల వరకు డబ్బులను ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టిన మొత్తానికి డబ్బులు వస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు 6.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకోసారి మారుస్తూ ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు. లేదా పెరగొచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఒక వేళ భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్‌లో చేరితే రూ.9 లక్షలు ఒకేసారి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వీరిద్దరికి కలిపి ప్రతి సంవత్సరం రూ.60 వేల వరకు లభిస్తాయి. అంటే నెలకు రూ.5 వేలు వస్తాయి. ఇలా పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులకు ఎలాంటి రిస్క్‌ ఉండదు. మంచి లాభం పొందవచ్చు. అంతేకాకుండా ఒకేసారి డబ్బులు డిపాజిట్‌ చేయకుండా ప్రతినెల, లేదా ఆరు నెలలకోసారి కూడా డిపాజిట్‌ చేసే పథకాలు ఉన్నాయి. మెచ్యూరిటీ కాలం తర్వాత నెలనెల డబ్బులు లభిస్తాయి. డబ్బులు డిపాజిట్‌ చేసేవారికి ఇలాంటి స్కీమ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి:

Whatsapp Cashback: వాట్సాప్ అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్

ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!