AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పని చేయకున్నా ప్రతి నెలా 9250 గ్యారెంటీ ఆదాయం.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే..

ఇంట్లో కూర్చునే ప్రతి నెలా రూ. 9 వేలకు పైగా రెగ్యులర్ ఆదాయం పొందడం సాధ్యమేనా? పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా ఇది ఖచ్చితంగా సాధ్యమే.. నెలవారీ ఖర్చులు, మెడికల్ బిల్లుల కోసం ఎదురుచూసే కుటుంబాలకు భరోసానిచ్చే ఈ పథకంలో అసలుకు పూర్తి రక్షణతో పాటు 5 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పని చేయకున్నా ప్రతి నెలా 9250 గ్యారెంటీ ఆదాయం.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే..
Post Office Monthly Income Scheme
Krishna S
|

Updated on: Aug 29, 2026 | 12:33 PM

Share

ప్రస్తుత రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ఎలాంటి రిస్క్ లేని సురక్షితమైన రాబడిని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్లు, నెలవారీ ఇంటి అవసరాలకు స్థిరమైన పెన్షన్ తరహా ఆదాయం ఆశించే మధ్యతరగతి కుటుంబాలకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక నమ్మకమైన ఆర్థిక మార్గంగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చిన్న పొదుపు పథకాల్లో ఒకటైన ఈ స్కీమ్‌లో ఒకేసారి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెలా స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌కు వార్షికంగా 7.4 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తుంది. కనీసం రూ.1000తో ఖాతా తెరిచి.. ఆపై ఎంత మొత్తమైనా పొదుపు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా రూ.9 లక్షలు వరకు డిపాజిట్ చేయడానికి వీలుంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడిగా ఖాతా తెరిచి గరిష్టంగా రూ.15 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో ప్రతి భాగస్వామికి సమాన వాటా ఉంటుంది.

నెలకు రూ. 9,250 ఆదాయం ఎలా లభిస్తుంది?

ఉమ్మడి ఖాతా ద్వారా గరిష్ట పరిమితి అయిన రూ. 15 లక్షలను 7.4% వార్షిక వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలానికి జమ చేసినప్పుడు లభించే రాబడి లెక్కలు..

  • ప్రతి నెలా – రూ. 9,250
  • ఒక సంవత్సరానికి – రూ.1.11 లక్షలు
  • మొత్తం 5 ఏళ్లకు – రూ.5.55 లక్షలు

ఈ పథకంలో ప్రతి నెలా వచ్చే రూ. 9,250 వడ్డీ నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో జమవుతుంది. 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే, మీరు డిపాజిట్ చేసిన అసలు మొత్తం రూ. 15 లక్షలు రూపాయి కూడా తగ్గకుండా పూర్తిగా వెనక్కి లభిస్తాయి.

వ్యక్తిగత ఖాతా పై రాబడి

ఒకవేళ మీరు సింగిల్ అకౌంట్‌లో గరిష్ట పరిమితి అయిన రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే..

  • నెలవారీ వడ్డీ ఆదాయం: రూ. 5,550
  • వార్షిక రాబడి: రూ. 66,600
  • 5 సంవత్సరాల మొత్తం వడ్డీ: రూ. 3,33,000

ముందస్తు క్లోజింగ్ నిబంధనలు

ఈ పథకం గడువు 5 సంవత్సరాలైనప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో ఖాతాను ముందే క్లోజ్ చేసుకునే సదుపాయం కల్పించారు. అయితే దీనిపై కొన్ని షరతులు, జరిమానాలు వర్తిస్తాయి. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 1 సంవత్సరం పూర్తయ్యే వరకు ఎలాంటి ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఖాతా తెరిచిన 1 ఏడాది తర్వాత, 3 ఏళ్ల లోపు రద్దు చేసుకుంటే.. అసలు డిపాజిట్ మొత్తం నుంచి 2 శాతం పెనాల్టీగా మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. 3 ఏళ్లు దాటిన తర్వాత ఖాతా క్లోజ్ చేస్తే, అసలు మొత్తం నుంచి 1 శాతం కట్ అవుతుంది.

ఈ పథకం ఎవరికి బెస్ట్..?

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే పథకం కావడంతో పెట్టుబడికి నూటికి నూరు శాతం భద్రత లభిస్తుంది. స్టాక్ మార్కెట్ నష్టభయాలు లేకుండా, వృద్ధాప్యంలో లేదా నెలవారీ ఇంటి అద్దెలు, మెడికల్ ఖర్చుల కోసం క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒక నిర్దిష్ట ఆదాయం కోరుకునే వారికి పోస్టాఫీస్ ఎంఐఎస్ ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ టూల్.

Follow Us