POCO X3 Pro: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.2,499కే పోకో ఎక్స్‌3 ప్రో.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌

| Edited By: Ram Naramaneni

Apr 15, 2021 | 8:59 AM

POCO X3 Pro Exchange Offer: ప్రస్తుతం మొబైల్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా మొబైల్‌ తయారీ...

POCO X3 Pro: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.2,499కే పోకో ఎక్స్‌3 ప్రో.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌
Poco X3 Pro
Follow us on

POCO X3 Pro Exchange Offer: ప్రస్తుతం మొబైల్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా మొబైల్‌ తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇక పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ చేసి ఏకంగా రూ.16,500 డిస్కౌంట్‌ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే మీరు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుందన్నట్లు. పోకో ఎక్స్‌ 3 ప్రో 6జీబీ+1258 జీబీ వేరియంట్‌ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.20,999. మీ పాత ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ చేసి రూ.16,500ల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

అయితే పోకో ఎక్స్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ను రూ.2,499 ధరకే సొంతం చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.16,500 విలువ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ అంతకన్నా తక్కువ విలువ ఉంటే మిగతా మొత్తాన్ని చెల్లించి పోకో ఎక్స్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ పొందవచ్చు. అలాగే ఒక వేళ పోకో ఎక్స్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ను డైరెక్టర్‌గా సేల్‌లో కొనుగోలు చేయాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై రూ. రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

ఇవీ చదవండి: OnePlus 9: వన్ ప్లస్ 9ఆర్ సేల్ తేదీ వచ్చేసింది.. 9 సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఇదే.. అద్భుతమైన ఫీచర్స్‌

Sony Smart Tv: స్మార్ట్‌ టీవీలు, ఆడియో ఉత్పత్తులపై సోనీ భారీ ఆఫర్లు.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీల విడుదల