PMFBY: ప్రధానమంత్రి బీమా యోజన తాజా అప్‌డేట్.. ఈ 3 రాష్ట్రాల రైతులు గరిష్ట ప్రయోజనం పొందారు.. ఎలాగంటే..?

|

Oct 31, 2021 | 7:25 PM

PMFBY: ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతుల పంట బీమా క్లెయిమ్‌లు మునుపటి సంవత్సరం కంటే 60 శాతం తగ్గాయి. 2020-21 సంవత్సరానికి

PMFBY: ప్రధానమంత్రి బీమా యోజన తాజా అప్‌డేట్.. ఈ 3 రాష్ట్రాల రైతులు గరిష్ట ప్రయోజనం పొందారు.. ఎలాగంటే..?
Pmfby
Follow us on

PMFBY: ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతుల పంట బీమా క్లెయిమ్‌లు మునుపటి సంవత్సరం కంటే 60 శాతం తగ్గాయి. 2020-21 సంవత్సరానికి రూ.9,570 కోట్లకు చేరుకున్నాయి. ఎందుకంటే ఏడాది కాలంలో ప్రధాన పంటలకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ 2019-20 సంవత్సరాలకు ప్రభుత్వం చాలా పంటల బీమా క్లెయిమ్‌లను పరిష్కరించింది. దాదాపుగా రూ.27,398 కోట్లు అని నిర్దారించారు. 2016-17లో PMFBY ప్రారంభించారు.

పథకం కార్యాచరణ, మార్గదర్శకాలు రబీ 2018 , ఖరీఫ్ 2020లో సవరించారు. ఈ పథకం ప్రయోజనాలను రైతులకు సకాలంలో అందించడానికి ఈ సవరణలు చేశారు. డేటా ప్రకారం 2020-21లో 612 లక్షల మంది రైతులు 445 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి బీమా చేశారు. దీని కింద బీమా మొత్తం రూ.1,93,767 కోట్లు. 2020-21 సంవత్సరంలో మొత్తం క్లెయిమ్‌లు రూ.9,570 కోట్లుగా ఉన్నాయి. బీమా క్లెయిమ్‌లు ఖరీఫ్ సీజన్‌లో రూ.6,779 కోట్లు, రబీ సీజన్‌లో రూ.2,792 కోట్లుగా ఉన్నాయి.

2020-21లో బీమా క్లెయిమ్‌లలో తగ్గుదల
వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ “2020-21లో రూ. 9,570 కోట్ల విలువైన బీమా క్లెయిమ్‌లు జరిగాయి. ఎందుకంటే ఏడాది కాలంలో ప్రధాన పంటలకు పెద్దగా నష్టం జరగలేదు. ఈ సమయంలో రాజస్థాన్ నుంచి గరిష్టంగా రూ.3,602 కోట్ల విలువైన పంట బీమా క్లెయిమ్‌లు వచ్చాయి. ఆ తర్వాత రూ.1,232 కోట్లతో మహారాష్ట్ర, రూ.1,112.8 కోట్లతో హర్యానా ఉన్నాయి.

2016లో ప్రధాని మోడీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించారు
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ని 18 ఫిబ్రవరి 2016న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. PMFBY అన్ని ఆహార మరియు నూనెగింజల పంటలకు వర్తిస్తుంది.

నిరుద్యోగులకు శుభవార్త..! ప్రభుత్వం వీటి ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తోంది..

PF Alert: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక..! ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది..?

Viral Photos: ఈ పువ్వు చాలా విశిష్టమైనది..! ఒక్క పురుగు కూడా దీనిపై వాలదు.. ఎందుకంటే..?