కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. అలాగే చిన్న వీధి వ్యాపారులు తమ సొంత వ్యాపారం ప్రారంభించేందుకు కావాల్సిన పెట్టుబడికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సరసమైన ధరలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆ పథకమే ‘పీఎం స్వానిధి యోజన’.
కోవిడ్ సమయంలో చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎంతో లబ్దిపొందారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించింది కేంద్ర ప్రభుత్వం.ముఖ్యంగా వీధి వ్యాపారులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి స్వానిధి యోజన ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇస్తోంది.
ఈ పథకం కింద మొదటిసారిగా మీరు ఎటువంటి హామీ లేకుండా 10,000 రూపాయల వరకు రుణ మొత్తాన్ని పొందవచ్చు. అలాగే తీసుకున్న రుణాన్ని 12 నెలల్లోపు మొత్తాన్ని తిరిగి ఇచ్చిన తర్వాత, మీరు రెండవసారి రూ. 20,000, డవసారి రూ. 50,000 రుణం పొందవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ 7 శాతం చొప్పున వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీకు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం విశేషమేమిటంటే ఇప్పటి వరకు 43 శాతం మంది చిన్న మహిళా వ్యాపారులు దీని ద్వారా ఆర్థిక సహాయం పొందారు. SBI నివేదిక ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు 70 లక్షల రుణాలు అందించగా, మొత్తం 9,100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి