PM Street Vendor’s Scheme: దేశం అభివృద్ధి చెందాలంటే.. ప్రతి ఒక్కరూ జీవనోపాధిని, సంపాదన మార్గాన్ని కలిగివుండాలి. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం..చిరు వ్యాపారస్తులకు అండగా నిలిచేలా పీఎం స్వీనిధి పథకం( (SVANidhi) 2020 జూన్ 1న ప్రారంభించింది. దీనిని గత కొన్ని నెలలుగా అమలు చేస్తోంది. తాజాగా పీఎం స్వీనిధి పథకం జీవిత కాలాన్ని కేంద్ర ప్రభుతం పొడిగించింది. ఈ పథకం ద్వారా వ్యాపారులు రుణాల కోసం డిసెంబర్ 2024 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు రుణాలను పొంది ఆర్థికంగా ఎదగవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఈ పథకం గడువు మార్చి 2022తో ముగియనుంది. అయితే ఇప్పుడు దీని కాలాన్ని డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకాన్ని పీఎం స్వీనిధి ( PM SVANIdhi ) అని కూడా పిలుస్తారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి తేరుకునేలా ఉపాధిని పునరుద్ధరించడానికి ఈ పథకం ప్రారంభించబడింది .
#Cabinet approves continuation of Prime Minister Street Vendor’s AtmaNirbhar Nidhi (PM SVANidhi) beyond March 2022 till December 2024#CabinetDecisions
— Jaideep Bhatnagar (@DG_PIB) April 27, 2022
పథకం ప్రారంభ లక్ష్యం: పీఎం స్వీనిధి పథకం ద్వారా 34 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని ఒక నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, పీఎం స్వీనిధి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3628 కోట్ల రుణాలను జారీ చేసింది. కరోనా కారణంగా వ్యాపారం లేదా ఉపాధి కోల్పోయిన వారికి ఈ రుణం అందించబడింది. ప్రధానమంత్రి స్వీనిధి యోజన కింద.. అటువంటి వ్యక్తులు బ్యాంకుల నుండి సులభంగా రుణాలు తీసుకొని వారి ఉపాధిని పునరుద్ధరించకోవచ్చు.
పథకం గురించి వివరాలలోకి వెళ్తే: కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మే 2020లో ప్రారంభించింది. దేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ప్రజల జీవన విధానంఫై తీవ్ర ప్రభావం చూపించింది. లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా రోజువారీ కూలీలు, వీధి వ్యాపారుల పై తీవ్ర ప్రభావం చూపించింది. లాక్‌డౌన్‌తో దినసరి కూలీల సంపాదన పూర్తిగా నిలిచిపోయింది. తర్వాత పరిస్థితి మెరుగుపడినా చేతిలో డబ్బులు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దిగువ శ్రేణి ప్రజలకు ఉపాధిని కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం స్వీనిధి కింద రుణాలు ఇవ్వడం ప్రారంభించింది.
ప్రభుత్వం ఎంత రుణం ఇస్తుందంటే: ఈ పథకం కింద, దరఖాస్తుదారునికి మొదటిసారిగా రూ.10,000 రుణం ఇస్తారు. ఇది ఉపాధి మూలధనం. దీనివల్ల ఉపాధిని కల్పించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం ప్రారంభించి అనంతరం వ్యాపారాభివృద్ధికి కోసం మళ్ళీ డబ్బు అవసరమైతే రెండోసారి రూ.20వేలు, మూడోసారి రూ.50వేలు రుణం ఇస్తారు. రుణం మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ప్రస్తుతం, పీఎం స్వీనిధి రుణం 7% వడ్డీ రేటుతో ఇవ్వబడుతుంది. రుణంలో తీసుకున్న మొదటి డబ్బును తిరిగి చెల్లించిన తరువాత, రెండవ , మూడవ విడతలు విడుదల చేస్తారు.
ఎవరు ప్రయోజనం పొందుతారంటే:
పీఎం స్వీనిధి పథకం కింద బార్బర్ షాప్, స్ట్రీట్ ఫుడ్ విక్రేత దారులు, పాన్ షాప్ , లాండ్రీ షాప్, కూరగాయలు అమ్మేవారు, టీ బండ్లు, ఆహార పదార్థాలను విక్రయించే వ్యక్తులు, పుస్తకం లేదా స్టేషనరీ దుకాణం , కళాకారులు వంటి వారు ఈ ఋణం తీసుకోటానికి అర్హులు.
Also Read :
Inspiring Story: 3 వేలతో మొదలై.. లక్షలు దాటిన బిజినెస్.. స్వయం ఉపాధితో రాణిస్తూ.. 19మందికి ఉపాధినిస్తున్న మహిళ
Viral Video: చిన్నారి బాలిక మ్యాజిక్ టాలెంట్ .. నెట్టింట్లో వీడియో వైరల్.. 60లకుపైగా లైక్స్ సొంతం
Shiva Purana: ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఆరు మాసాల్లో మరణం.. శివపురాణం ఏం చెబుతోంది?