PM Solar Panel Yojana: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. కేంద్ర ప్రభుత్వ పథకం గురించి వివరాలు తెలుసుకోండి..

|

Jan 09, 2023 | 5:50 PM

రైతుల సంక్షేమం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన, కృషి హోండా, నరేగా తదితర పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

PM Solar Panel Yojana: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. కేంద్ర ప్రభుత్వ పథకం గురించి వివరాలు తెలుసుకోండి..
Pm Solar Panel Yojana
Follow us on

రైతుల సంక్షేమం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన, కృషి హోండా, నరేగా తదితర పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సోలార్ ప్యానెల్ యోజన (పీఎం సోలార్ ప్యానెల్ యోజన) ను అమలు చేసింది. ఇది రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చే మార్గంగా మారింది. విద్యుత్, ఇంధనం మన దేశానికి చాలా ముఖ్యమైనవి. ఈ తరుణంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఎన్నో వ్యూహాలను రచిస్తోంది. వేసవి కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ కోత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సోలార్ పీనల్ స్కీమ్‌ను అమలు చేసింది. రైతులు ఈ పథకాన్ని అవలంబిస్తే విద్యుత్‌లో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు ఆర్థికంగా కూడా బలపడవచ్చు. ఈ ప్రాజెక్ట్ రైతులకు, ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. రైతులు ఈ పథకాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

PM సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్ వివరాలు..

దేశవ్యాప్తంగా 20 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి సోలార్ ప్యానెల్ పథకం ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. సొంత భూమి ఉన్న రైతులు తమ భూమిలో సోలార్ ప్యానెళ్లను అమర్చి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ విద్యుత్‌ను సొంత వినియోగంతో పాటు స్థానిక డిస్కమ్‌లకు విక్రయించవచ్చు. ఒక యూనిట్ విద్యుత్‌ను 30 పైసలకు విక్రయించవచ్చు. అలాగే, రైతులు వ్యవసాయం కోసం సంప్రదాయ విద్యుత్ లేదా డీజిల్ మోటార్లకు బదులుగా సోలార్ పంపులను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం వినియోగదారులకు ప్రభుత్వం నుంచి 60% సబ్సిడీ కూడా లభిస్తుంది.

సంవత్సరానికి 3 లక్షలకు పైగా లాభం

ప్రభుత్వం ఇచ్చిన అంచనా ప్రకారం.. ఒక మెగా వాట్ యూనిట్ నుంచి ఏడాదిలో 11 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇంత కరెంటును యూనిట్‌కు 30 పైసలు చొప్పున విక్రయిస్తే ఏడాదిలో రూ.3.36 లక్షలు ఆర్జించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంత స్థలం కావాలి?

ఒక మెగా వాట్ సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి దాదాపు 72 వేల చదరపు అడుగుల స్థలం అవసరం. అంటే దాదాపు ఒకటిన్నర నుంచి రెండు ఎకరాల భూమి అవసరం. ఇందుకోసం 4 వేల సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చాలి. దీనికి 4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి సబ్సిడీ ఇవ్వవచ్చు లేదా ప్రభుత్వమే ఉచితంగా అందించవచ్చు.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి..

ఈ పథకంపై ఆసక్తి ఉన్న రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు PM సోలార్ ప్యానెల్ స్కీమ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళితే, మీరు దరఖాస్తు వివరాలను పొందవచ్చు. హోమ్ పేజీలోనే సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ లింక్ ఉంది. అక్కడికి వెళ్లి నమోదు చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు:

  • ఆధార్ కార్డు
  • ఫోటో
  • మొబైల్ నెం
  • రేషన్ కార్డు
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • నివాస ధృవీకరణ కార్డు
  • బ్యాంక్ పాస్ బుక్
  • భూమి పట్టాదారు పాస్ బుక్..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..