AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద 16 సార్లు నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇదిలా ఉంటే 17వ విడత నిధులపై అందరి దృష్టిపడింది. రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు ఎప్పుడు వస్తాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ నిధులకు సంబంధించి పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి...

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
Pm Kisan
Narender Vaitla
|

Updated on: May 20, 2024 | 1:07 PM

Share

రైతన్నలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు, పెట్టుబడి భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతులకు ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతులుగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోకి నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద 16 సార్లు నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇదిలా ఉంటే 17వ విడత నిధులపై అందరి దృష్టిపడింది. రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు ఎప్పుడు వస్తాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ నిధులకు సంబంధించి పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. పీఎం కిసాన్‌ 17వ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈసారి ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్‌ డబ్బులు వస్తాయని సమాచారం. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతా కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలని అధికారులు చెబుతున్నారు. సమయానికి కిసాన్‌ నిధులు రావాలంటే కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేగా మీ సందేహం. ఇందుకోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వాలి..

* ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో కుడివైపున కనిపించే e-KYC ఆప్షన్స్‌పై క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వత మీ ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* వెంటనే మీ వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్