PM Kisan: అలర్ట్.. గడువు ముగుస్తోంది.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు..

|

Jul 19, 2022 | 11:13 AM

అయితే ఇటీవల ఈ పథకం ద్వారా అనర్హులు సైతం డబ్బులు పొందారు. ఇప్పుడు వారిపై కేంద్రం దృష్టి సారించింది.

PM Kisan: అలర్ట్.. గడువు ముగుస్తోంది.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు..
Pm Kisan
Follow us on

PM Sisan Samman Nidhi Yojana: రైతులకు వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి వారి ఖాతాల్లో రూ. 6 వేలు నేరుగా జమచేస్తుంది కేంద్రం. ప్రతి ఏడాది రూ. 2 వేల చొప్పుల మూడు విడతలుగా పూర్తి నగదును అందచేస్తుంది. ఇప్పటివరకు 11 విడతల నగదు రైతుల ఖాతాల్లో జమచేశారు. ఇందులో దాదాపు 10 కోట్ల మంది రైతులు కేంద్రం అందిస్తున్న నగదును అందుకున్నారు. ప్రస్తుతం అన్నదాతులు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఇక లేటేస్ట్ అప్డే్ట్ ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు.

అయితే 12వ విడత నగదు పొందాలంటే రైతులు ముందుగా e-KYCని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే పీఎం కిసాన్ నగదు పొందలేరు. జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాల్సి ఉంటుందని కేంద్రం గడువు ఇచ్చింది.

e-KYC ఎలా పూర్తి చేయాలి ?..
* ముందుగా పీఎం కిసాన్ యోజన వైబ్సైట్ లాగిన్ కావాలి.
* ఆ తర్వాత ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేసి, e-KYC ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
* అనంతరం ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.
* e-KYC పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇటీవల ఈ పథకం ద్వారా అనర్హులు సైతం డబ్బులు పొందారు. ఇప్పుడు వారిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ పథకం ద్వారా నగదు పొందిన అనర్హులు ఆ డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వారు ప్రభుత్వం నోటీసులు సైతం పంపించింది.