PM Kisan: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా ప్రతియేటా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు అందిస్తోంది. చిన్న,సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. రైతు లకు ఆర్థికసాయంగా ఏడాదిలో మూడుసార్లు రూ. 2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది..
రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి పీఎం కిసాన్ స్కీమ్‌ను తీసుకువచ్చారు. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతులకు అందిస్తోంది కేంద్రం. ఈ డబ్బులు ఒకే సారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ఈ సందర్భంలో పథకం 18వ విడత 5 అక్టోబర్ 2024న అందించగా, ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో తదుపరి టర్మ్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకి వెళ్లండి.
కొత్త రైతు నమోదు చేసుకునే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
అక్కడ అడిగిన వివరాలను పూరించండి. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించండి.
తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
మొబైల్ నంబర్‌ను ఎలా లింక్ చేయాలి?
పీఎం కిసాన్ స్కీమ్‌లో పలువురు రైతులు మొబైల్ నంబర్‌ను లింక్ చేయకపోవడంతో డబ్బులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పథకంలో వారు తమ సెల్ ఫోన్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవచ్చు.