PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఒకే క్లిక్‌తో చిటికెలో తెలుసుకోండి.. ప్రాసెస్ ఇదే..

పీఎం కిసాన్ సాయాన్ని ప్రధాని మోదీ శనివారం విడుదల చేస్తున్నారు. జూన్ 20న 4 గంటలకు పశ్చిమబెంగాల్‌లో జరిగే సభలో రిలీజ్ చేయనున్నారు. విడుదల చేయగానే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో మీకు డబ్బులు వస్తాయా.. లేదా అనేది ముందే చూసుకోండి..

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఒకే క్లిక్‌తో చిటికెలో తెలుసుకోండి.. ప్రాసెస్ ఇదే..
Pm Kisan

Updated on: Jun 19, 2026 | 12:59 PM

రైతులకు కేంద్రం ప్రభుత్వం సూపర్ న్యూస్ అందించింది. రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సాయాన్ని జూన్ 20వ తేదీన విడుదల చేయనుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నగదును శనివారం రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. 22వ విడత నగదును అసోం వేదికగా ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేయగా.. 23వ విడత సొమ్మును పశ్చిమబెంగాల్‌లో రిలీజ్ చేయనున్నారు. హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి విడుదల చేయనున్నారు. 9.44 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.18,880 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ సాయం పొందాలంటే లబ్దిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది.

ఓటీపీ తప్పనిసరి

ఓటీపీ ఆధారిత కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో భాగంగా కొన్ని అనుమానిత కేసులను శాఖ గుర్తించిట్లు కేంద్రం తెలిపింది. వీరిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి యాజమాన్యం పొందిన రైతులు, కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నవారికి భౌతిక ధృవీకరణ పూర్తయ్యే వరకు సొమ్మును తాత్కాలికంగా నిలిపివేశారు. రైతులు మరిన్ని వివరాల కోసం పీఎం కిసాన్ కిసాన్ వెబ్‌సైట్,మొబైల్ యాప్‌లోని ‘నో యువర్ స్టేటస్’ లేదా కిసాన్ ఇ-మిత్ర చాట్‌బాట్‌లో తమ అర్హత స్థితిని తనిఖీ చేసుకోవాలని కేంద్రం కోరింది.

మీకు వస్తుందా..? లేదా? అనేది తెలుసుకోవడం ఎలా..?

-పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో కింద లబ్దిదారుల జాబితే అనే ఆప్షన్ ఎంచుకోండి

-మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను నమోదు చేయండి

-అనంతరం గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయండి

-మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన లబ్దిదారుల లిస్ట్ విడుదల అవుతుంది

-అందులో మీ పేరు ఉండి, కేవైసీ పూర్తి చేస్తే మీకు డబ్బులు అందుతాయి

చెక్ చేస్కోండి

రేపు ప్రధాని మోదీ డబ్బులు విడుదల చేయనన్న క్రమంలో లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో.. లేదో ఒకసారి చెక్ చేస్కోండి. లేకపోతే స్థానిక అధకారులను అడిగి వివరాలు తెలుసుకోండి. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేయండి.

Follow Us