PM Kisan: పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదా..? రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేస్తేనే..

పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదని చాలామంది ఆందోళన పడుతుంటారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాకపోవచ్చు. మీరు కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల పీఎం కిసాన్ నగదు పొందే అవకాశాలు ఉంటాయి. అవేంటి అనేది చూద్దాం.

PM Kisan: పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదా..? రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేస్తేనే..
Pm Kisan Scheme

Updated on: Jun 05, 2026 | 7:41 PM

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఆర్ధిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా రూ.6 వేల చొప్పున నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. మూడు విడతలుగా వీటిని అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 22వ విడత నగదును ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో వీటిని రిలీజ్ చేశారు. త్వరలో 23వ విడత నగదును కూడా కేంద్రం జమ చేసేందుకు సిద్దమవుతోంది. కానీ కొంతమంది అకౌంట్లలో ఇంకా గత ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు జమ కాలేదు. ఇలాంటివారు ఈ పనులు చేస్తే డబ్బులు పడే అవకాశముంది. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ పని పూర్తి చేయండి

ఏడాదికి ఒకసారి పీఎం కిసాన్ లబ్దిదారులు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే కేంద్రం డబ్బులను నిలిపివేస్తోంది. దీంతో లబ్దిదారులు కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం ఎప్పటికప్పుడు సూచిస్తోంది. కానీ కొంతమంది రైతులు చేయకపోవడంతో నగదు నిలిపివేస్తున్నారు. ఇది పూర్తి చేశాక మళ్లీ అకౌంట్లలో జమ చేస్తున్నారు. మీ గత ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు పడకపోతే కేవైసీ పూర్తి చేశారో.. లేదా చూసుకోండి. ఒకవేళ కంప్లీట్ చేసుకోకపోతే ఆన్‌లైన్ లేదా సమీపంలో సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేస్కోండి. మీ సేవ సెంటర్‌కు వెళ్లి అయినా పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికార పోర్టల్‌కు వెళ్లి ఆధార్ నెంటర్ ఎంటర్ చేసి ఓటీపీ నమోదు చేయడం ద్వారా కేవేైసీ  ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

భూ సమస్యలు ఉంటే..

ఇక భూమి లావాదేవీలకు సంబంధించి సమస్యలు ఉన్నా నగదు జమ కావు. ఇలాంటి సమయంలో ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి. భూమి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరుపైకి మార్చినప్పుడు బదలాయింపు సరిగ్గా జరిగిందా..లేదా అనేది చూసుకోవాలి. పేర్లు సరిగ్గా మారాయా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక భూ యాజమాని మైనర్‌గా ఉండి బదిలీ సరిగ్గా జరక్కపోతే పీఎం కిసాన్ నగదు నిలిచిపోతుంది. ఇక మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోయినా డబ్బులు రావు. దీంతో బ్యాంకుకు వెళ్లి లింక్ చేసుకోండి. ఈ ప్రక్రియలు అన్నీ పూర్తి చేయడం ద్వారా మీకు పీఎం కిసాన్ నగదు అనేవి అకౌంట్లో పడతాయి. అప్పటికీ పడకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించండి.

 

Follow Us