UPI apps: ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి… ఎన్‌పీసీఐకు చిన్న యూపీఐ యాప్‌ల వినతి

తాజాగా చిన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్‌లు భారతదేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు ఫిర్యాదు చేసినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్‌లో గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్‌తో పోటీ పడేందుకు మరిన్ని ప్రోత్సాహకాలను కోరుతున్నాయి. ఎస్‌పీసీఐ ద్వారా జరిగిన సమావేశంలో చిన్న యూపీఐ యాప్‌లు పరిమిత మార్కెటింగ్ బడ్జెట్‌ల కారణంగా క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను అందించలేకపోతున్నారని పేర్కొన్నారు.

UPI apps: ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి… ఎన్‌పీసీఐకు చిన్న యూపీఐ యాప్‌ల వినతి
UPI

Updated on: Mar 06, 2024 | 7:00 PM

భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో యూపీఐ లావాదేవీలు అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్‌లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి 2016లో కేంద్రం ఎన్‌పీసీఐ సహకారంతో యూపీఐ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకోవడానికి ఎలాంటి రుసుములు అవసరం లేకపోవడంతో ఈ సేవలు చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే తాజాగా చిన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్‌లు భారతదేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు ఫిర్యాదు చేసినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్‌లో గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్‌తో పోటీ పడేందుకు మరిన్ని ప్రోత్సాహకాలను కోరుతున్నాయి. ఎస్‌పీసీఐ ద్వారా జరిగిన సమావేశంలో చిన్న యూపీఐ యాప్‌లు పరిమిత మార్కెటింగ్ బడ్జెట్‌ల కారణంగా క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెజాన్ పే, జూపిటర్, స్లైస్, బజాజ్పే, నావీ టెక్నాలజీస్, టాటా నియో వంటి యాప్‌లు ప్రోత్సాహకాలను కోరుతున్నాయి. 

చిన్న యూపీఐ యాప్‌ల సవాళ్లు ఇవే

క్యాష్‌బ్యాక్ ఇన్సెంటివ్‌లను అందించిన తర్వాత కూడా అగ్రశ్రేణి యాప్‌ల నుంచి మార్కెట్ వాటాను సంగ్రహించడానికి వ్యూహాలను రూపొందించడం చాలా కష్టమని ఆయా యాప్‌ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌లు యూపీఐ లావాదేవీల్లో 95 శాతం వాటాతో ఉన్నాయి. 

నెలవారీ సమావేశాలు

యూపీఐలో మార్కెట్ వాటా అసమతుల్యతను పరిష్కరించడానికి నెలవారీ సమావేశాలను నిర్వహించాలని ఎన్‌పీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డిసెంబర్ తర్వాత (బహుశా) పొడిగించబడింది. చిన్న యూపీఐ యాప్‌లు కొత్త ఫీచర్‌లను అమలు చేయడానికి ప్రోత్సాహకాలను పెంచడంతో పాటు ఎన్‌పీసీఐ నుంచి మెరుగైన బ్రాండింగ్‌ని తీసుకురావడానికి మరింత సమయాన్ని అభ్యర్థించాయి. అంతేకాకుండా వినియోగదారులకు ఎక్కువ క్యాష్‌బ్యాక్ అందించాలని ఎన్‌పీసీఐ అప్లికేషన్‌లను కోరింది. పేమెంట్ గేట్‌వేల వద్ద ఉన్న వ్యాపారి యాప్‌లు, వెబ్‌సైట్‌లు ప్రాధాన్య యూపీఐ యాప్‌లను ప్రదర్శించే అధికారాన్ని కలిగి ఉన్నాయి. వీటిల్లో ఎన్‌పీసీఐ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మార్కెట్ షేర్ ఇలా

ప్రస్తుతం భారత మార్కెట్ యూపీఐ విషయంలో ఫోన్ పే  47 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. గూగుల్ పే 36.4 శాతంతో ఉంది. అలాగే నియంత్రణ సమస్యల కారణంగా పేటీఎం వాటా 11 శాతానికి పడిపోయింది. అయితే పేటీఎం మార్కెట్ షేర్ క్షీణించడం కొనసాగితే మార్కెట్లో ద్వంద్వ రాజ్యం ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి