Business Ideas: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. ఫ్యాన్‌ కింద కూర్చోని లక్షలు సంపాదించవచ్చు! ఆ బిజినెస్‌ ఏంటంటే..?

చాలామందికి మంచి వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే ప్లాస్టిక్ మార్ట్ బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. 5 లక్షల ప్రారంభ పెట్టుబడితో, తయారీదారుల నుండి నేరుగా వస్తువులు కొనుగోలు చేసి, రిటైల్, హోల్‌సేల్ అమ్మకాలతో మంచి ఆదాయం పొందవచ్చు.

Business Ideas: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. ఫ్యాన్‌ కింద కూర్చోని లక్షలు సంపాదించవచ్చు! ఆ బిజినెస్‌ ఏంటంటే..?
Indian Currency 2

Updated on: Jan 11, 2026 | 9:00 AM

చాలా మందికి ఏదో ఒక మంచి బిజినెస్‌ చేసి, అద్భుతమైన ఆదాయం పొందాలని ఉంటుంది. అయితే కొంతమంది దగ్గర మంచి ఐడియా ఉండి పెట్టుబడికి డబ్బు ఉండకపోవచ్చు. మరికొంత మంది దగ్గర డబ్బు ఉండి ఏ బిజినెస్‌ చేయాలో అవగాహన ఉండకపోవచ్చు. అలా కాస్త పెట్టుబడి పెట్టగలిగే వారి కోసం ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సాధారణంగా ఇప్పుడు ప్రతి ఇంట్లో వందలో 90 శాతం వస్తువులు ప్లాస్టిక్‌వి వచ్చేశాయి. ఏదో ఒక విధంగా ప్రతి చిన్నా పెద్దా అవసరానికి ప్లాస్టిక్‌ వస్తువులపై ఆధారపడాల్సి వస్తుంది. బక్కెట్‌లు, చీపుర్లు, దువ్వెనలు, పోపు డబ్బాలు.. ఇలా చెప్పుకుంటే ఈ ప్లాస్టిక్‌ లిస్టు పెద్దదే. పైగా ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. అందుకే జనం వీటినే ఎక్కువగా కొంటున్నారు. వీటికి ఉన్న డిమాండ్‌నే ఇప్పుడు మనం బిజినెస్‌గా మార్చుకోవచ్చు. ఒక మంచి టౌన్‌ లేదా సెంటర్‌ను ఎందచుకొని, ఒక షాప్‌ను అద్దెకు తీసుకొని ప్లాస్టిక్‌ మార్ట్‌ తెరవచ్చు.

అంతకంటే ముందుగా మీరు ఓ ముఖ్యమైన పనిచేయాలి. సాధారణంగా హోల్‌సేల్‌ దగ్గర సరుకు కొనేకంటే.. నేరుగా తయారీదారు నుంచే సరుకు కొంటే మీకు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అప్పుడు మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. ప్లాస్టిక్‌ వస్తువులను క్వాలిటీగా తయారు చేసే కంపెనీని గూగుల్‌లో సెర్చ్‌ చేయండి. ఫోన్‌ నంబర్‌ ఉంటే సంప్రదించండి. లేదంటే నేరుగా కంపెనీకి వెళ్లి మాట్లాడండి. అది ఇండియాలో ఎక్కడున్నా వెళ్లండి. ఎందుకంటే మొదటిసారి వెళ్లి క్లియర్‌గా మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్లే సరుకు పంపించేలా మాట్లాడుకొండి. అయితే ప్లాస్టిక​్‌ వస్తువులను మీరు ఒకే షాపులో ఉండి అమ్మడంతో పాటు ఇతర చిన్న చిన్న షాపులకు తక్కువ మార్జిన్‌ చూసుకొని సరఫరా చేయండి. దాంతో మీకు బల్క్‌లో సేల్స్‌ అవుతాయి. ఈ బిజినెస్‌ కోసం పెట్టుబడిగా ఒక ఐదు లక్షలు ఉంటే సరిపోతుంది. ఒక లక్ష షాప్‌ అడ్వాన్స్‌ కోసం ఖర్చు చేసినా, రూ.4 లక్షలతో సరుకు కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి