Post Office Scheme: డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. సంపాదించిన డబ్బును పొదుపు చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కేవలం పొదుపు చేయడం మాత్రమే కాకుండా దానిపై రిటర్న్స్ వచ్చేలా ప్లాన్ చేస్తుంటారు. ఇందుకోసం ఫైనాన్స్ సంస్థలు సైతం రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి.
ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్‌లో పోస్టాఫీస్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ మొత్తం నుంచి పెట్టబడులు పెట్టుకునే అవకాశం ఉండడంతో చాలా మంది పోస్టాఫీస్‌ను తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బెస్ట్ ఆప్షన్స్‌గా భావిస్తున్నారు. మరి పోస్టాఫీస్ అందిస్తోన్న కొన్ని బెస్ట్ సేవింగ్ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి..
ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ అందిస్తోన్న రికరింగ్ డిపాజిట్ అకౌంట్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఐదేళ్ల కాల పరిమితితో ఉండే ఈ స్కీమ్‌లో 5.8 శాతం వడ్డీని అందిస్తారు. కాంపౌండింగ్ వడ్డీ ప్రతి మూడో నెలకు కలుపుతారు. ఈ స్కీమ్‌లో వినియోగదారులు నెలకు కనీసం రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెట్టుబడికి మాగ్జిమం ఇన్వెస్ట్‌మంట్ అంటూ ఏం లేదు.
పోస్టాఫీస్ అందిస్తోన్న ఈ స్కీమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ జాబితాలోకి వస్తుంది. ఇందులో వినియోగదారులు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధిలో పెట్టుబడులు పెట్టొచ్చు. 5.5 శాతం వడ్డీ అందిస్తారు. అయితే ఐదేళ్లు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గరిష్టంగా 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో నెలకు కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఏడాదికి 5.50 శాతం, రెండేళ్లకు 5.50 శాతం, మూడేళ్లకు 5.5 శాతం, ఐదేళ్లకు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీస్ అందిస్తోన్న బెస్ట్ స్కీమ్స్‌లో ఇదీ ఒకటి. ఇందులో 5 ఏళ్లకు గాను 6.8 శాతం వడ్డీ అందిస్తారు. కనీసం రూ. వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాల పరిమితి తర్వాతే డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 80సీ ప్రకారం ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..