
ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ ఏదో వాహనం చేతిలో ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సిటీ పరిధిలోని వారు. ఎందుకంటే ట్రాఫిక్ రోడ్లలో ఎక్కువగా వెళ్లాల్సి రావడం, కార్లు, బస్సులు అయితే టైం వృథా కావడంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ద్విచక్ర వాహనం తీసుకుంటున్నారు. పైగా ఇంట్లో అవసరాలకు కూడా బాగా ఉపకరిస్తూ ఉండటంతో స్కూటర్ లేదా బైక్ ను కొనుగోలు చేస్తున్నారు. అందుకుగానూ చాలా మంది లోన్లకు అప్లై చేస్తున్నారు. లేదా ఫైనాన్స్ మీద తీసుకుంటున్నారు. ఎక్కువ మంది టూ వీలర్ లోన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ లోన్ మీకు సులభంగా మంజూరు కావాలంటే ప్రధానంగా మీకు కావాల్సిన క్రెడిట్ స్కోర్. ఫైనాన్షియర్లు దీనిపైనే ఫోకస్ చేస్తారు. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీకు సులభంగా, తక్కువ వడ్డీకే లోన్ మంజూరు చేస్తారు. అదే తక్కువ ఉంటే ఇబ్బంది పడాలి. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేసే అంశాలు ఏంటి? దాని ప్రయోజనం ఏమిటి? బ్యాంకర్లు ఇచ్చే లోన్ కి దానికి సంబంధం ఏమిటి? లోన్ కావాలంటే ఎంత క్రెడిట్ స్కోర్ ఉండాలి. తెలుసుకుందాం రండి..
క్రెడిట్ స్కోర్ అంటే.. సాధారణంగా క్రెడిట్ స్కోర్ అంటే మీరు తీసుకున్న రుణం తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం. పలు క్రెడిట్ బ్యూరోలు వీటిని లెక్కిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే మీరు తీసుకున్న రుణం తిరిగి ఇబ్బంది లేకుండా చెల్లిస్తారు అని బ్యాంకర్లు నమ్ముతాయి. దీంతో మీకు సులభంగా లోన్లు మంజూరు అవుతాయి.
లోన్ కోసం క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి.. మీకు టూ వీలర్ లోన్ కావాలంటే మీకు ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ఉండాలి. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది 700 నుంచి 750 ఉంటే మంచి స్కోర్ అని అర్థం. ఇలాంటి వారికి బ్యాంకర్లు సులువుగా లోన్లు మంజూరు చేస్తాయి. అదే 650 నుంచి 700 వరకూ ఉన్నా ఫర్వాలేదు. ఇతర అంశాలను సరిచూసుకొని లోన్లు మంజూరు చేస్తారు. అయితే 650 కన్నా తక్కువ ఉంటే మాత్రం బ్యాంకర్లు లోన్లు ఇవ్వవు. దరఖాస్తులు తిరస్కరిస్తారు. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీతో ఇస్తాయి.
అధిక క్రెడిట్ స్కోర్ మీ లోన్‌లోని ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ పేమెంట్ వంటి అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
డౌన్ పేమెంట్.. అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే సులువుగా అధిక మొత్తంలో లోన్ దొరకడంతో పాటు వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. మీరు చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ ను తగ్గిస్తుంది.
ప్రాసెసింగ్ ఫీజు.. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మీ బైక్ లోన్ వడ్డీపై మాత్రమే కాక ఇతర అనుబంధ చార్జీపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రాసెసింగ్ ఫీజు విషయంలో. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ చార్జీలతో సహా మరింత అనుకూలమైన నిబంధనలపై మీరు రుణాన్ని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.