New Scam: పిగ్ బచరింగ్.. ఇదో కొత్త రొమాన్స్ స్కామ్.. మెసేజ్‌లు, కాల్స్‌తో మాయాజాలం

|

Jan 06, 2024 | 7:47 PM

వాస్తవానికి ఇది క్రిప్టో స్కామ్, దీనికి రొమాన్స్ అంశాలు మిక్స్ చేశారు. అందుకే దీన్ని రొమాన్స్ స్కామ్ అని కూడా అంటారు. స్కామర్‌లు మీకు అమాయక సందేశాన్ని పంపి, నెమ్మదిగా శృంగార సంబంధాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. స్కామర్ లక్ష్యం క్రిప్టోకరెన్సీలో మీతో పెట్టుబడి పెట్టించడమే. క్రిప్టో కాకుండా, స్టాక్‌లు లేదా ఏదైనా ఇతర ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. ప్రారంభంలో..

New Scam: పిగ్ బచరింగ్.. ఇదో కొత్త రొమాన్స్ స్కామ్.. మెసేజ్‌లు, కాల్స్‌తో మాయాజాలం
New Scam
Follow us on

మీకు తెలియని నెంబర్ నుండి ఎప్పుడైనా టెక్స్ట్ (Text Meaage ) మెసేజ్ వచ్చిందా..? వీటిని పంపించినవారు మీకు తెలిసినవారే అనిపించేటట్లుగా టెక్స్ట్ మెసేజ్ లు పంపించారా?.. అంటే హలో, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం కలవలేదు. లేదా మీరు ఈ రోజు ఖాళీగా ఉన్నారా? నేను ఈరోజు ఒక ఈవెంట్‌కి వెళ్తున్నాను, వస్తావా? ఇలాంటి మెసేజ్‌ లాంటివన్నమాట. మీ సమాధానం అవును అయితే, మీరు పిగ్ బచరింగ్ అనే స్కామ్ లో చిక్కుకున్నారని అర్థం. ఈ పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు తెలుసుకోవాలి.

వాస్తవానికి ఇది క్రిప్టో స్కామ్, దీనికి రొమాన్స్ అంశాలు మిక్స్ చేశారు. అందుకే దీన్ని రొమాన్స్ స్కామ్ అని కూడా అంటారు. స్కామర్‌లు మీకు అమాయక సందేశాన్ని పంపి, నెమ్మదిగా శృంగార సంబంధాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. స్కామర్ లక్ష్యం క్రిప్టోకరెన్సీలో మీతో పెట్టుబడి పెట్టించడమే. క్రిప్టో కాకుండా, స్టాక్‌లు లేదా ఏదైనా ఇతర ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. ప్రారంభంలో కొద్దిపాటి రాబడులు కూడా అందులో ఉంటాయి. దీన్నే ఫిగ్ ఫేటనింగ్ అంటారు. అంటే లక్ష్యంపై నమ్మకాన్ని సంపాదించడం. క్రిప్టోలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఇన్వెస్ట్‌మెంట్ యాప్ గ్లిచింగ్ ప్రారంభమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మిమ్మల్ని మోసగించే వ్యక్తి మానవ అక్రమ రవాణాకు బాధితుడే కావచ్చు.

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ఈ స్కామ్‌ను గ్లోబల్ స్కామ్‌గా చెప్పింది. ప్రధానంగా మయన్మార్, కంబోడియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుండి పనిచేసే సిండికేట్‌లని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ తరహా మోసం చైనా నుంచి మొదలైంది. తాజాగా భారత్‌లోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. మానవ అక్రమ రవాణా బాధితులు.. సైబర్ నేరాలకు బలవంతంగా పాల్పడుతున్నారు. ఈ తరహా తొలి కేసును తెలంగాణ పోలీసులు నమోదు చేశారు. ఇటువంటి మోసపూరిత పథకాలకు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ ప్రచారంలో భాగంగా ఈ విచారణ జరిగింది. ఇలాంటి ముఠాల లింకులు ఆగ్నేయాసియా దాటి కూడా విస్తరిస్తాయని ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంటర్‌పోల్ ఆపరేషన్ కారణంగా, వివిధ దేశాలలో 281 మందిని అరెస్టు చేశారు. 149 మంది బాధితులను రక్షించారు. 360 కి పైగా కేసులు నమోదు చేశారు. వీటిలో చాలా వరకు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.

మయన్మార్‌లో కనీసం 1,20,000 మంది ప్రజలు బందీలుగా ఉన్నారని, బలవంతంగా ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారని UN నివేదిక పేర్కొంది. కంబోడియాలో ఇలాంటి బందీల సంఖ్య లక్ష. లావోస్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలలో, వేలాది మంది ప్రజలు ఇలాంటి పని చేయవలసి వస్తోంది. ఇలాంటి మోసాల ద్వారా స్కామ్ ముఠాలు కోట్లాది డాలర్లు సంపాదిస్తున్నాయి.

మరి, మనం అలాంటి మోసాలను ఎలా అడ్డుకోవచ్చు? వాటికి అడ్డుకట్ట వేయడం ఎలాగో మీరు తెలుసుకోవాలి. తెలియని వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించిన వెంటనే అప్రమత్తంగా ఉండండి. స్కామర్లు తరచుగా నకిలీ గుర్తింపులు, ప్రొఫైల్‌లను సృష్టించి వాటి సాయంతో ప్రజలను బాధితులుగా చేస్తారు. అధిక రాబడులు వస్తున్నాయన్న ఆశతో ఎలాంటి భావోద్వేగ సమయంలోనూ, ఒత్తిడిలోనూ.. ఎలాంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకండి. ఎలాంటి పెట్టుబడి అయినా పెట్టే ముందు సరైన పరిశోధన చేయండి. తెలియని వ్యక్తులతో బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా ఆర్థిక విషయాలను ఎప్పుడూ షేర్ చేయకండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి