PhonePe: విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే..! పూర్తి వివరాలివే..

|

Feb 08, 2023 | 8:13 AM

ఇంతకాలం కూడా యూపీఐ పేమెంట్స్ కేవలం మన దేశానికే పరిమితమయ్యేవి. విదేశీల్లో ఉన్న మన వారికి యూపీఐ ద్వారా చెల్లించే అవకాశం లేకపోయింది. కానీ ఇకపై అలాంటి..

PhonePe: విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే..! పూర్తి వివరాలివే..
Phonepe Now Supports International Payments
Follow us on

ప్రస్తుత కాలంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అనేది ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఎందుకంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని రకాల లావాదేవీలను యూపీఐ యాప్స్ ద్వారానే చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మూడు పెద్ద దేశాల్లో కంటే మన దేశంలో జరిగిన యూపీఐ పేమెంట్స్ అధికంగా ఉన్నాయంటేనే ఆర్థం చేసుకోవాలి మనం ఏ స్థాయిలో వాడేస్తున్నామనేది. అయితే ఇంతకాలం కూడా యూపీఐ పేమెంట్స్ కేవలం మన దేశానికే పరిమితమయ్యేవి. విదేశీల్లో ఉన్న మన వారికి యూపీఐ ద్వారా చెల్లించే అవకాశం లేకపోయింది. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది పడే అవసరం లేదు. మీ వాళ్లు విదేశాల్లో ఉన్నా సరే.. వారికి కూడా ఇకపై మీ యూపీఐ ద్వారానే చెల్లింపులు చేయవచ్చు. ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ యూపీఐ సేవలను ప్రారంభించిన దేశంలోనే తొలి ఫిన్ ‌టెక్ సంస్థగా అవతరించింది.

ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న యూపీఐ లావాదేవీలలో ఫోన్‌పే దే తొలి స్థానం. ఇప్పుడు విదేశాలకు సైతం పేమెంట్స్ చేసే అవకాశం కల్పిస్తోంది ఈ యూపీఐ సర్వీస్ యాప్. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యాపారులకు కూడా యూపీఐ ద్వారానే చెల్లింపులు చేయవచ్చు. ఈ సదుపాయం ద్వారా పేమెంట్స్ చేసినప్పుడు విదేశీ కరెన్సీ మీ ఖాతా నుంచి డిడెక్ట్ అవుతుంది. అంటే ఇది ఇంటర్నేషనల్ డిబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌తో సమానం. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లోని స్థానిక క్యూఆర్ కోడ్ ఫోన్‌పేతో సపోర్ట్ చేస్తాయని ఫిన్‌టెక్ సంస్థ తెలిపింది. త్వరలోనే మరిన్ని దేశాల్లో తమ సేవలను విస్తరిస్తామని కూడా వెల్లిడించింది.

ఈ విషయంపై ఫోన్‌పే సీటీఐ, కోఫౌండర్ రాహుల్ చారీ మాట్లాడుతూ..‘ప్రపంచం యూపీఐని అనుభూతి చెందేందుకు యూపీఐ ఇంటర్నేషనల్‌ను తీసుకురావడం తొలి అడుగుగా భావిస్తున్నాం. ఇది ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందనుకుంటున్నాం. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేందుకు ఎంతగానే ఉపయోగపడుతుంద’అన్నారు. అయితే ఫోన్ పే యాప్‌లో యూపీఐ ఇంటర్నేషనల్ ఎంచుకున్నప్పుడు అందుకు తగినట్లుగా బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి. విదేశీలకు వెళ్లిన సందర్భంలోనూ అక్కడి నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు. తద్వారా భారత దేశం వెలుపల పేమెంట్స్ చేసేందుకు కస్టమర్లకు క్రెడిట్ కార్డ్, ఫారెక్స్ కార్డ్ అవసరం లేదు. గతేడాది జులైలో నేషనల్ పేమెంట్స్ సీఈఓ రితేశ్ సుక్లా కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే.. విదేశీ మార్కెట్లకు సైతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ విస్తరిస్తామని తెలిపారు. ఇది బెల్జియంకు చెందిన క్రాస్ బార్డర్ పేమెంట్స్ SWIFTకు ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి