Petrol Prices Hike: ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులపై మళ్లీ పెట్రో(crude prices rising) బాంబు పడనుందా? అవును ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్(Russia- Ukraine) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న రష్యాపై ఐరోపా దేశాలు, అమెరికా తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించడంతో భారత్ పై కూడా ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే చాలా దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నడుస్తున్నందున కొంతకాలంగా పెట్రో ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉండటంతో పెట్రో డీజిల్ ధరల పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఇంచుమించు 100 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. 2021 నవంబర్ 4 నుంచి భారత్‌లో పెట్రో ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈ కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 80 నుంచి 94 డాలర్లకు పెరిగింది. మరికొద్ది రోజుల్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు చేరుతుందని నిపుణలు అంచనాలు వేయటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 45 పైసలు పెరుగుతుంది. అంటే.. నవంబర్ 4 నుంచి పెరిగిన బ్యారెల్ ధరల ప్రకారం.. దేశంలో ఇంధన ధరలు సుమారు రూ.6 పెరగాల్సి ఉంది.
దీనికి తోడు ఆ పెరిగిన ధరలపై ప్రభుత్వం విధించే వివిధ పన్నులను కలుపుకుంటే.. ఆ ధర రూ. 8కి చేరుకుంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా దేశంలోనూ పెట్రో ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమనుతోందని తెలుస్తోంది. నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరిన తీరుకు సామాన్యులు తమ వాహనాలను బయటకు తీసేందుకు సైతం జెంకారు. తరువాత కేంద్రం తగ్గింపు పేరుతో కొంత ఊరటను ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ.. అది కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు చేరలేదు. ఎక్కువగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే తగ్గించిన ధరల ప్రయోజనాన్ని ప్రజలకు అందించారు. కానీ.. ఇప్పడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మళ్లీ బాదుడు షురూ కానుందా! అనే దానికి మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం నుంచి జవాబు రానుంది.
ఇవీ చదవండి..
కస్టమర్లకు QR కోడ్ అలర్ట్ జారీ చేసిన SBI
coconut oil making: సంప్రదాయ పద్ధతిలో కొబ్బరి నూనె తయారీ విధానం ఇలానే.. వెరీ సింపుల్!