Petrol Diesel Rate Today: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మీ నగరంలో ధరలను తెలుసుకోండిలా..

|

Jun 29, 2022 | 8:32 AM

Petrol Diesel Rate Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. గతంలో ఎగబాకిన ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. మే 22వ తేదీ నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..

Petrol Diesel Rate Today: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మీ నగరంలో ధరలను తెలుసుకోండిలా..
Follow us on

Petrol Diesel Rate Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. గతంలో ఎగబాకిన ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. మే 22వ తేదీ నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక తాజాగా జూన్‌ 29వ తేదీ (బుధవారం)న దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రకటన తర్వాత మే 22న ధర తగ్గింది. ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24కు విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రేట్‌ రూ. 109.64గా ఉండగా, డీజిల్‌ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచ మార్కెట్‌లో 117 డాలర్ల స్థాయిలో విక్రయిస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్ అండ్ సేల్ (PPAC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, జూన్ 27న భారతీయ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు $ 112.60. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధర బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంది.

ప్రస్తుతం రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చవకగా చమురును దిగుమతి చేసుకుంటుందనేది ఉపశమనం కలిగించే వార్త. రష్యా నుండి భారతదేశం ముడి చమురు దిగుమతి ఏప్రిల్ నుండి 50 రెట్లు పెరిగింది. మొత్తం దిగుమతి చేసుకున్న చమురులో దాని వాటా 10 శాతానికి పెరిగింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా 0.2 శాతం మాత్రమే. ఏప్రిల్‌లో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 10 శాతం. ఇది ఇప్పుడు టాప్ 10 సరఫరాదారులలో ఒకటి. ప్రైవేట్ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), నైరా ఎనర్జీ రష్యా చమురులో 40 శాతం కొనుగోలు చేశాయి. గత నెలలో భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా సౌదీ అరేబియాను రష్యా అధిగమించింది. రష్యా భారీ తగ్గింపుతో భారత్‌కు ముడి చమురును ఆఫర్ చేసింది. మే నెలలో భారతీయ రిఫైనరీ కంపెనీలు దాదాపు 25 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయి.

SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు

ఇవి కూడా చదవండి

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్> అని టైప్‌ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపితే ధరల వివరాలు వస్తాయి. HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్‌ చేసి 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్‌ చేసి 9223112222 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపితే ధరల వివరాలు వస్తాయి. అయితే ముడి చమురును 2 వేలకు పైగా వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ ప్రాంతం కోడ్ ను తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి