Fuel Price Today: వాహనదారులకు చుక్కలు చుపిస్తున్న ఇంధన ధరలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

|

Jul 17, 2021 | 12:45 PM

Petrol, Diesel Rates Hiked Again: దేశంలో ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సామాన్యులు లబోదిబోమంటున్నారు. రెండు రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజీల్ ధరలు

Fuel Price Today: వాహనదారులకు చుక్కలు చుపిస్తున్న ఇంధన ధరలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel price Today
Follow us on

Petrol, Diesel Rates Hiked Again: దేశంలో ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సామాన్యులు లబోదిబోమంటున్నారు. రెండు రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై మళ్లీ 36 పైసలు పెంచగా, డీజిల్‌పై 15 పైసలు మేర తగ్గించాయి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర వంద మార్క్ దాటింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటి పరుగులు పెడుతోంది. జూలైలో ఇప్పటివరకు ఇంధన ధరలు దాదాపు 10 సార్లవరకు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డుకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
రాష్ట్ర రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.54 పైసలకు చేరగా, డీజిల్ ధర 89.87 పైసలకు చేరింది.
ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 107.54 పైసలకు చేరగా, డీజిల్ ధర రూ. 97.45 పైసలకు చేరింది.
కోల్‌కతాలో పెట్రోల్ లీటరు ధర రూ.101.54 పైసలుగా ఉండగా, డీజిల్ ధర రూ. 89.87 పైసలుగా ఉంది.
భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.89 కి చేరగా, డీజిల్‌ రూ.98.67 గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.101.74, డీజిల్‌ రూ.93.02 గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.51 కి చేరగా.. డీజిల్‌ 97.62గా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.107.70 కి చేరగా.. డీజిల్ ధర రూ. 99.60 కి పెరిగింది.

Also Read:

Prashant Kishor: కాంగ్రెస్‌లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాకపుట్టిస్తున్న ఢిల్లీ రాజకీయాలు..

Andhrapradesh: ఏపీలో ప్లాస్టిక్ భూతం.. పశువులు, పక్షులు పాలిట యమపాశంలా మారిన వైనం