Petrol, Diesel Prices Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత..?

|

Feb 09, 2022 | 10:39 AM

Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం దూసుకెళ్లిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేక్‌లు పడ్డాయి. వాహనదారుకుల ఊరటిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌..

Petrol, Diesel Prices Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత..?
Follow us on

Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం దూసుకెళ్లిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేక్‌లు పడ్డాయి. వాహనదారుకుల ఊరటిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు చెక్‌ పెట్టింది. దీంతో గతకొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెరుగుదల నిలిచిపోయింది. ఇదిలా ఉంటే గ్లోబల్‌ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. బుధవారం దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

► ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.95.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.67 ఉంది.

► ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.14 ఉంది.

► చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.101.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.91.43 ఉంది.

► కోల్‌కతా పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.104.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.87 ఉంది.

► బెంగళూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.01 ఉంది.

► హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.62గా ఉంది.

► వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.107.69 ఉండగా, డీజిల్ ధర రూ.94.14 గా ఉంది.

► విజయవాడలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.110.69 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.75గా ఉంది.

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం ధరలు ఏ మాత్రం తగ్గలేదు.

ఇవి కూడా చదవండి:

Credit Score: రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇలా చేస్తే నష్టమే..!

Renault India: కార్ల విక్రయాలలో దూసుకుపోతున్న రెనాల్ట్‌.. 8 లక్షలకు చేరిన విక్రయాలు..!