Petrol Diesel Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన చమురు సంస్థలు.. నాలుగు రోజుల గ్యాప్‌ అనంతరం పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..

|

Mar 01, 2021 | 7:55 AM

Petrol Diesel Price Today: వాహనదారులకు చమురు సంస్థలు మళ్లీ షాక్ ఇచ్చాయి. దాదాపు నాలుగు రోజుల పాటు స్థిరంగా ఉన్న..

Petrol Diesel Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన చమురు సంస్థలు.. నాలుగు రోజుల గ్యాప్‌ అనంతరం పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..
Follow us on

Petrol Diesel Price Today: వాహనదారులకు చమురు సంస్థలు మళ్లీ షాక్ ఇచ్చాయి. దాదాపు నాలుగు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను ఇవాళ మళ్లీ పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 0.25 పైసలు పెంచగా.. డీజిల్ పై 17 పైసలు పెంచారు. తాజాగా పెరిగిన ధరలు నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

పెరిగి ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 94.79 కి లభిస్తోంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ రూ. 88. 86 కు లభిస్తోంది. ఇక తెలంగాణలోని వరంగల్ జిల్లాలో లీటర్ ధర రూ. 94.37 ఉండగా, డీజిల్ ధర రూ. 88.45 గా ఉంది. కరీంనగర్‌లో డీజిల్ ధర రూ. 88.62 ఉండగా, పెట్రోల్ ధర రూ. 94.91 వద్ద లభిస్తోంది. ఇక నల్గొండ జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 94.74 లకు లభిస్తుండగా, డీజిల్ రూ. 88.79 లభ్యమవుతోంది. ఖమ్మంలో లీటర్ ఫెట్రోల్ ధర రూ. 95.17 ఉంది. డీజిల్ ధర రూ. 89.19.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.2 కాగా, డీజిల్ 90.72. విశాఖపట్నంలో పెట్రోల్ ధ రూ. 96.27. డీజిల్ ధర రూ. 89.82. ఇక కృష్ణా జిల్లాలో పెట్రోల్ ధర రూ. 97.21 గా ఉండగా, డీజిల్ ధర రూ. 90.67 ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 97.13గా ఉండగా, డీజిల్ రూ. 90.72 లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి..
దేశ రాజధాని ఢిల్లీ సోమవారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17 గా ఉంది. డీజిల్ ధర రూ. 81.47 గాఉంది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 97.57 కి లభిస్తోంది. డీజిల్ రూ. 88.60 కి లభిస్తోంది. పుణెలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.37 ఉండగా, డీజిల్ 87.06 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11 గా ఉంది. డీజిల్ రూ. 86.45గా ఉంది. పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో లీటర్ పెట్రోల్ రూ. 91.35 లకు లభిస్తుండగా, డీజిల్ రూ. 84.35 లకు లభిస్తోంది.

Also read:

Modi receives COVID vaccine : కరోనా టీకా‌ వేయించుకున్న ప్రధాని, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఫస్ట్‌ డోస్‌.. కొవిడ్ రహిత భారతావనికి పిలుపు

Sandeep Koritala : తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖహీరో..