వాహనదారులకు బ్యాడ్ న్యూస్… రూ.7 పెరగనున్న పెట్రోల్ ధర?

| Edited By:

Sep 16, 2019 | 7:28 PM

పెట్రో ధరలు అమాంతం పెరగబోతున్నాయా? ఊహించని విధంగా ఏకంగా రూ.7 పెరిగే అవకాశం ఉందా? అంటే.. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎందుకంటే.. గత వారం సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీలో జరిగిన డ్రోన్ దాడే దానికి కారణంగా తెలుస్తోంది. సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే పెట్రో ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసే అతి పెద్ద కంపెనీ. హుతీ రెబెల్స్ చేసిన డ్రోన్ దాడిలో సౌదీలోని అబక్ అండ్ ఖురాయిస్‌లో […]

వాహనదారులకు బ్యాడ్ న్యూస్... రూ.7 పెరగనున్న పెట్రోల్ ధర?
Follow us on

పెట్రో ధరలు అమాంతం పెరగబోతున్నాయా? ఊహించని విధంగా ఏకంగా రూ.7 పెరిగే అవకాశం ఉందా? అంటే.. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎందుకంటే.. గత వారం సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీలో జరిగిన డ్రోన్ దాడే దానికి కారణంగా తెలుస్తోంది. సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే పెట్రో ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసే అతి పెద్ద కంపెనీ. హుతీ రెబెల్స్ చేసిన డ్రోన్ దాడిలో సౌదీలోని అబక్ అండ్ ఖురాయిస్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో కంపెనీ తమ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించింది. వచ్చే రెండు రోజుల వరకు ఆయిల్ ఉత్పత్తిని సగం వరకు తగ్గించనున్నట్టు సదరు కంపెనీ ప్రకటించింది. దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేశాకే ఉత్పత్తిని పెంచుతామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో… వచ్చే 15 రోజుల్లో లీటర్‌పై రూ.5 నుంచి రూ.7 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత 28 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం 20 శాతం పెరిగాయి. 1991 జనవరి 14 తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయని, అయితే, త్వరలో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. క్రూడ్ ఆయిల్ ధరలు మరో 10 శాతం వరకు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భగ్గుమంటాయని పెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి.