Petrol Diesel Rate Today: దేశంలో చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. బుధవారం ఇంధన ధరలు (Fuel Rates) మరోసారి పెరిగాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో సుమారు 3 నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol And Diesel Rates) ఎన్నికల ఫలితాల అనంతరం భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు ప్రతీ రోజూ దాదాపు 80, 90 పైసల వరకు పెంచుతూనే వస్తున్నాయి. డీజిల్ ధరలు కూడా పెట్రోల్‌తో సమానంగా వస్తున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 16 రోజుల్లో చమురు ధరలు 14 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ పై దాదాపు రూ.10 మేర పెరిగాయి. కాగా.. బుధవారం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
Also Read: