Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రో మంట.. ఏపీలో సెంచరీ కొట్టిన డీజిల్ ధర..

|

Sep 30, 2021 | 8:31 AM

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. కానీ, బుధవారం దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల..

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రో మంట.. ఏపీలో సెంచరీ కొట్టిన డీజిల్ ధర..
Petrol Diesel Prices
Follow us on

Petrol-Diesel Rates Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. కానీ, గురువారం దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేసింది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.74గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 98.06గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.61గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.94గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.50గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.17గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.47గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.74 ఉండగా.. డీజిల్ ధర రూ.98.06గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.43 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.77గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.67 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.39 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.51 ఉండగా.. డీజిల్ ధర రూ. 99.28గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.36లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.14గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.99గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.67 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.39లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.71కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.52గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.17 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.97 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.42 ఉండగా.. డీజిల్ ధర రూ.94.55గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.18 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.38గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.50 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.05గా ఉంది.

ఇవి కూడా చదవండి: IPL srh vs csk Match Prediction: చెన్నైతో సై అంటే సై.. విజయోత్సాహంతో దూకుడుమీదున్న హైదరాబాద్

Skin Care: మీ ముఖం మీద అవాంఛిత పుట్టుమచ్చలు ఉన్నాయా.. వాటిని తొలిగించుకునేందుకు ఇంట్లోనే ఇలా చేయండి..