Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే మార్పులు

|

Apr 30, 2021 | 7:02 AM

Petrol, Diesel Rates Today: ఇటీవల కాలంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే మార్పులు
Fuel Price
Follow us on

Petrol, Diesel Rates Today: దేశంలో ఇటీవల భారీగా పెరిగిన చమురు ధరలకు కొంచెం బ్రేక్ పడింది. దీంతో సామాన్యులకు కొంతమేర ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వ్యక్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. అయితే.. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు మరికొన్ని చోట్లనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.44 గా ఉంది. డీజిల్‌ ధర రూ.89.95 గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.36 ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.92 గా ఉంది.
విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.93 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.44 గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.93.99 కి ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది.
వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది.
కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.15 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది.
ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది.
కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.
బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది.

Also Read:

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..