Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాలు మినహా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి. కొన్ని రాష్ట్రాల్లోని నగరాల్లో పెట్రోల్ ధర తక్కువగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు పెట్రోల్ పరుగులు పెడుతోంది. పెట్రోల్ వెంటే తాను అంటూ నెమ్మదిగా అక్కడికే నడక మొదలు పెట్టింది డీజిల్ ధర. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.27గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 92.07గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.14 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.92.64 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 98.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 92.64గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.84గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.35ఉండగా.. డీజిల్ ధర రూ.92.14 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.49గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.67కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.89 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.63ఉండగా.. డీజిల్ ధర రూ.92.87గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.05 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.12 గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.39గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.67లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.93.89 లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 93.44గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 84.32 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.71కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.57 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 93.49 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 86.46 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 95.06 ఉండగా.. డీజిల్ ధర రూ.88.62 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.96.55 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.88.14 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.84.26గా ఉంది.