Petrol Diesel Price: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Feb 20, 2022 | 8:51 AM

పెట్రో ధరలపై బడ్జెట్ ప్రభావం కనిపించలేదు. పెరుగుతుందని అనుకున్నా.. దేశ వ్యాప్తంగా ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతోంది. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Petrol Diesel Price: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..
representative image
Follow us on

Petrol-Diesel Rates Today:  పెట్రో ధరలపై బడ్జెట్ ప్రభావం కనిపించలేదు. పెరుగుతుందని అనుకున్నా.. దేశ వ్యాప్తంగా ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతోంది. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యత్యాసాలున్నాయి. భారతదేశంలో నవంబర్ 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెబుతున్నారు. అయితే మార్చిలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్-డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించడంతో పాటు, ఇంధన ధరలు తగ్గడం వాహనదారులకు కాస్త ఊపిరి పీల్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. తద్వారా మహానగరంలో అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినా కూడా దేశంలోని 25 ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది.

ఇదిలావుంటే.. ఐఓసీఎల్ ఆదివారం దేశంలో ఇంధన చమురు ధరను ప్రకటించింది. నేటికీ ఇంధన చమురు ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు 109 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అయితే.. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యత్యాసాలున్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.52గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.91గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.60 ఉండగా.. డీజిల్ ధర రూ.94.99గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.96 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.45కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.51లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.65 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.74గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.36 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.68గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.45లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.51లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.12 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.66గా ఉంది.

ఇవి కూడా చదవండి: UP-Punjab Election 2022 Voting Live: ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ అప్‌డేట్ కోసం ఇక్కడ చూడండి..

LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..