Petrol Diesel Price: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..

|

Oct 17, 2021 | 8:44 AM

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటలు కొనసాగుతున్నాయి.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ

Petrol Diesel Price: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..
Petrol Diesel Prices: ఈ ఏడాది కరోనా తర్వాత ఎక్కువగా ప్రజలు మాట్లాడుకున్న అంశాం ఏంటంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెగుదల. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వీటి ధరలు సెంచరీ కొట్టాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు దేశీయ సుంకాలు తోడై సామాన్యుడి జేబులకు చిల్లు పెట్టాయి. అయితే, ఈ ఏడాది దీపావళికి ముందు కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంతమేర దిగొచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాట్‌ తగ్గించకపోవడంతో అదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
Follow us on

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటలు కొనసాగుతున్నాయి.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.09గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 103.18గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.97గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.05గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 110.18గా ఉండగా.. డీజిల్ ధర రూ. 103.23గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.22గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.21 ఉండగా.. డీజిల్ ధర రూ.103.29గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.12పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.71గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.38 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.83 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.90 ఉండగా.. డీజిల్ ధర రూ. 103.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.90 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.01గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.43గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.91గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 112.38 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.83లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 105.84 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.57 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.52 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.43 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 97.68 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 103.01 ఉండగా.. డీజిల్ ధర రూ.98.92గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.53పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.100.37గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.78 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.97గా ఉంది.

ఇవి కూడా చదవండి: Software Update: మీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెసెజ్ వస్తోందా.. చేసుకోక పోతే ఇక అంతే..

Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..