Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగులు ఆగడం లేదు. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.49గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 107.40గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.68గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.107.56గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 115.02గా ఉండగా.. డీజిల్ ధర రూ. 107.30గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.107.68గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.49 ఉండగా.. డీజిల్ ధర రూ.107.40గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.99 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.91గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.61 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.108.89 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.115.15 ఉండగా.. డీజిల్ ధర రూ. 107.48గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.53లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.107.83గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.78గా ఉండగా.. డీజిల్ ధర రూ.108.12గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 116.61 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.108.89లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 110.04 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.42 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.85కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.62 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.110.49 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 101.56 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 106.66 ఉండగా.. డీజిల్ ధర రూ.102.59గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.93 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.104.50 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.82 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.78గా ఉంది.
ఇవి కూడా చదవండి: