Petrol Diesel Price: ఒకే ఒక్క రోజు బ్రేక్.. మరో సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో..

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు..

Petrol Diesel Price: ఒకే ఒక్క రోజు బ్రేక్.. మరో సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో..
Petrol Diesel Prices
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 02, 2022 | 8:31 AM

Petrol Diesel Price Today: దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 2వ తేదీ శనివారం మళ్లీ చమురు ధరలను పెంచాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ , డీజిల్‌పై లీటరుకు 90 పైసలు, గుంటూరులో 88పైసలు పెరిగింది. కొత్త పెంపు తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర  రూ.116.3కు, డీజిల్ ధర లీటరుకు రూ.102.43కు పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.118.2, డీజిల్ రూ.103.94గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా రెండో వారం. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..

12 రోజుల్లో 10 సార్లు చమురు ధరలు పెరిగాయి

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 22 నుంచి ధరలు పెంచుకుంటూ వస్తున్నాయి. అక్కడి నుంచి చూస్తే ధరలు పెరగడం ఇది పదో సారి. ఈ 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు ఏకంగా రూ.7.2 మేర పైకి చేరాయి. నవంబర్ 4, 2021 నుంచి దేశవ్యాప్తంగా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, మార్చి 22 నుంచి చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 2 వరకు 12 రోజుల్లో 10 సార్లు చమురు ధరలు పెరిగాయి. నిన్న అంటే ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.33గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.102.45గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.51గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.102.61గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 116.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.90గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.33గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.86గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.33 ఉండగా.. డీజిల్ ధర రూ.102.45గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.01పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.117.35కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.70లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.116.82ఉండగా.. డీజిల్ ధర రూ. 103.26గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.42లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.90గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 118.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.45గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.119.01లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.70లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.102.61 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.79 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.112.19 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 97.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 108.21ఉండగా.. డీజిల్ ధర రూ.98.28గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.14 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.05గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.19 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.92గా ఉంది.

ఇవి కూడా చదవండి: Rachakonda Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి ఉచిత కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Drugs Case: డ్రగ్స్‌ కొనుగోళ్లకు కేటుగాళ్ల సీక్రెట్‌ కోడ్‌.. మత్తు దందాలో వెలుగులోకి కొత్త కోణాలు.