Petrol Diesel Price
Petrol – Diesel Price Today: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. చమురు కంపెనీలు ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర వంద మార్క్ దాటి పరుగులు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. కాగా.. ఆదివారం పెరుగుతున్న ధరల నుంచి కాస్త ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
మెట్రో నగరాల్లో..
దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.91కి చేరగా, డీజిల్ ధర రూ.89.88 గా ఉంది. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.106.93, డీజిల్ రూ.97.46 ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.29, డీజిల్ ధర రూ.95.26 ఉంది. భోపాల్‌లో పెట్రోల్ ధర రూ.109.24, డీజిల్ ధర రూ.98.67 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.01, డీజిల్ ధరరూ.92.97 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.67 ఉండగా, డీజిల్ ధర రూ.94.39 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.86గా, డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ. 105.37 ఉండగా, డీజిల్ ధర రూ.98.42 ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పెట్రోల్ ధర 107.07 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.60 ఉంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.106.64 ఉండగా, డీజిల్ ధర రూ.99.15గా ఉంది.