Petrol Diesel Price Today: తాజాగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Petrol Diesel Price Today: ప్రస్తుతం వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊరటనిస్తున్నాయి. ధరల కారణంగా వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. దాదాపు రూ..

Petrol Diesel Price Today: తాజాగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?
Follow us
Subhash Goud

|

Updated on: May 08, 2022 | 8:47 AM

Petrol Diesel Price Today: ప్రస్తుతం వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊరటనిస్తున్నాయి. ధరల కారణంగా వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. దాదాపు రూ.110 నుంచి రూ.120 వరకు ఉన్న పెట్రోల్‌  ధరలతో జనాలు సతమతమవుతున్నారు. ఒక్కసారిగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరలు.. గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అప్పటి నుంచి స్థిరంగా ఉంది. అప్పటి నుండి దేశీయ వంట గ్యాస్ ధర, CNG గ్యాస్ ధర కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు 113 డాలర్ల స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సగటు ధర లీటరుకు $ 1.33 అంటే రూ. 102 స్థాయిలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో సగటు పెట్రోల్ ధర లీటరుకు రూ.113గా ఉంది. ఆయిల్‌ కంపెనీల వివరాల ప్రకారం.. ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, డీజిల్‌ ధర రూ.105.49గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ ధర రూ.99.83 చొప్పున విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.110.85 ఉండగా, డీజిల్ రూ.100.94గా ఉంది.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

గ్యాస్ సిలిండర్ తాజా ధర

ఇవి కూడా చదవండి

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.999.5కి చేరుకుంది. ముంబైలో కూడా ఈ సిలిండర్ ధర రూ.999.5కి చేరింది. కోల్‌కతాలో రూ.1026 కాగా, చెన్నైలో రూ.1015.50కి చేరుకుంది. నోయిడాలో దీని ధర రూ.997.5 ఉంది. అంతకుముందు మే మొదటి రోజు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. మెట్రో నగరాల్లో దీని ధర రూ.104 వరకు పెరిగింది. మార్చి 22న కూడా 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్