Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? ఏ నగరంలో ఎంత..?

|

Oct 24, 2022 | 7:50 AM

దేశంలో పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. దేశంలోని ప్రధాన..

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? ఏ నగరంలో ఎంత..?
Indian Oil
Follow us on

దేశంలో పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో విధించే పన్ను వల్ల స్వల్ప మార్పులు ఉంటాయి తప్పా పెద్దగా తేడా ఉండదు. మే 24వ తేదీ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వందకుపైగానే ధరలు నమోదు అవుతున్నాయి. తాజాగా అక్టోబర్‌ 24వ తేదీని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.35, డీజిల్‌ ధర రూ.94.28

ఇవి కూడా చదవండి

కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24

బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89

హైదరాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.48, డీజిల్‌ ధర రూ.98.27.

SMS ద్వారా తనిఖీ చేయండి:

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి పంపవచ్చు, HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు. మీ ఏరియా కోడ్‌ను తెలుసుకోవాలంటే ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి