గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గుల పరిస్థితి చోటు చేసుకుంటుంది. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత 24 గంటల్లో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు చేస్తుంటుంది.
➦ ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.65, డీజిల్ ధర రూ . 89.82
➦ ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ. 94.27
➦ చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24
➦ కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76
➦ హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి