Fuel Price: నాన్‌స్టాప్‌గా పరుగెడుతున్న పెట్రోల్‌ ధర.. అక్కడ మాత్రం యమ స్పీడు.. ఏకంగా లీటర్‌ ధర రూ.120 దాటింది..!

|

Oct 27, 2021 | 7:15 PM

Fuel Price: దేశంలో పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ ధరలు పెరుగుతుండటం..

Fuel Price: నాన్‌స్టాప్‌గా పరుగెడుతున్న పెట్రోల్‌ ధర.. అక్కడ మాత్రం యమ స్పీడు.. ఏకంగా లీటర్‌ ధర రూ.120 దాటింది..!
Fuel Price
Follow us on

Fuel Price: దేశంలో పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ ధరలు పెరుగుతుండటం భారంగా మారుతుంటే .. మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో వాహనదారులకు భారంగా మారింది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటరు ధర వంద రూపాయల మార్కు దాటేశాయి. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.120 వరకు దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. రూ.110పైగా చేరడంతో వాహనదారులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లా కేంద్రంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.120.4కు చేరగా, డీజిల్‌ ధర రూ.110కి అందుకుంటోంది. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్‌లోనూ లీటరు పెట్రోల్‌ రూ. 119.23 గా నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. భోపాల్‌లోనూ లీటరు పెట్రోల్‌ ధర రూ.116.62 చేరగా, మంగళవారం పెట్రోల్‌పై 36పైసలు ఎగబాకి అదూ మరుసటి రోజు రికార్డు స్థాయిలో ధర రూ.120 మార్కును దాటినట్లు స్థానిక డీలర్‌ చెబుతున్నారు. ఇక డీజిల్‌ ధర కూడా రూ.109.17కి చేరింది. దాదాపు 250కి.మీ దూరంలో ఉన్న జబల్‌పూర్‌ ఆయిల్‌ డిపో నుంచి అనుప్పూర్‌ జిల్లా కేంద్రానికి పెట్రోల్‌ సరఫరా అవుతుందని, అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఇంధన ధరలు మరింతగా మండిపోతున్నాయని తెలిపారు. ఈ అక్టోబర్‌ నెలలోనే ఆయిల్‌ ధరలు 19 సార్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

► ఢిల్లీ – పెట్రోల్‌ రూ.107.94, డీజిల్‌ రూ.96.67

► ముంబై – పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75

► హైదరాబాద్‌ – పెట్రోల్‌ రూ.112.27, డీజిల్‌ రూ.105.46

► బెంగళూరు- పెట్రోల్‌ రూ.111.70, డీజిల్‌ రూ.102.60

► చెన్నై – పెట్రోల్‌ రూ.104.83, డీజిల్‌ రూ.100.92

► కోల్‌కతా – పెట్రోల్‌ రూ.108.45, డీజిల్‌ రూ.99.78

ఇవి కూడా చదవండి:

SBI Holders: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.342 చెల్లిస్తే.. రూ.4 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..!

LPG Gas Prices: దీపావళికి ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర