Petrol and Diesel Price Today: చమురు ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Apr 14, 2021 | 7:52 AM

Petrol And Diesel Rates Today: దేశంలో కొన్ని రోజుల నుంచి చమురు ధరలకు బ్రేక్‌ పడింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల జేబులు గుల్లయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు

Petrol and Diesel Price Today: చమురు ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Petrol And Diesel Price Today
Follow us on

Petrol And Diesel Rates Today: దేశంలో కొన్ని రోజుల నుంచి చమురు ధరలకు బ్రేక్‌ పడింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల జేబులు గుల్లయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అసలు నియంత్రణే లేకుండా పోయింది. పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100కు చేరువైంది. మరికొన్ని చోట్ల వంద దాటింది. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే.. భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత గళం సైతం వినిపించింది. పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళనలు చేశాయి. అయితే నిత్యం పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు గతకొన్ని రోజులగా బ్రేక్‌ పడుతూ వస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. గడిచిన కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. దీంతో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్,‌ డీజిల్‌ ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87 గా ఉంది.
* కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది.
* ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 గా ఉంది.
* చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.71 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.01 ఉంది.
* బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో..

* ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.38 గా ఉంది.
* విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.39 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది.
* విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.85 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.37గా ఉంది.

తెలంగాణలో..

* హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.94.16 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.94 గా ఉంది.
* వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది.
* కరీంనగర్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.94.42 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.44 గా ఉంది.

Also Read:

REALME C20: తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే రియల్‌ మీ బెస్ట్‌ ఆప్షన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Corona: నోటిని శుభ్రంగా ఉంచుకుంటే కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు..