Petrol and Diesel Price: ఒక పక్క అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు(Crude Oil Price) పెరిగుతూనే ఉన్నాయి. మరో పక్క కరోనా మూడో వేవ్ వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో దేశీయంగా మాత్రం పెట్రోల్(Petrol) , డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దాదాపుగా రెండునెలల పైగా భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు(Diesel Price) ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ఆధారంగా మారుతూ వస్తాయి. అయితే, కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతూనే వస్తున్నా.. భారత్ లో పెట్రోల్ ధరల్లో మాత్రం ఎటువంటి పెరుగుదల లేకపోవడం విశేషం. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర లీటర్ రూ.86.67గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్ ధరర రూ.94.14 ఉంది. చమురు కంపెనీల నుంచి అందుకున్న డేటా ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలలో చివరి మార్పు నవంబర్ 4, 2021 న జరిగింది. ఆ సమయంలో, పెట్రోలు, డీజిల్‌పై వర్తించే ఎక్సైజ్ సుంకాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించింది. అప్పటికి 70 రోజులు చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 2017 జూన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా మార్చే విధానం అమల్లోకి వచ్చింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:
► ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ.86.67
► ముంబైలో పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్ రూ. 94.14
► కోల్‌కతాలో పెట్రోల్ ధ రూ. 104.67, డీజిల్ ధ రూ. 89.79
► చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.4, రూ. 91.43.
► బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 100.58, డీజిల్ ధర రూ. 85.01
ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఏపీలో అక్కడక్కడ స్వల్ప మార్పులు తప్ప ధరల్లో పెద్దగా తేడా లేదు.
తెలంగాణలో..
► హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, డీజిల్ ధర రూ. 94.62.
► కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.108.07 ఉండగా, డీజిల్ ధర రూ.94.49.
► వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.107.69 ఉండగా, డీజిల్ ధరర రూ.94.14.
ఏపీలో..
► విజయవాడలో పెట్రోల్ ధర రూ.110.51 ఉండగా, డీజిల్ ధర రూ.96.59.
► విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా, డీజిల్ ధర రూ.95.18.
► విజయనగరంలో పెట్రోల్ ధర రూ.110.57 ఉండగా, డీజిల్ ధర రూ.96.59.
ఇవి కూడా చదవండి: Corona: కరోనా టెర్రర్.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..