Petrol, Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!

Petrol, Diesel Prices: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఏడో రోజు కూడా బ్రేక్ పడింది. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చివరగా గత శనివారం..

Petrol, Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
Petrol And Diesel Price

Updated on: Jul 24, 2021 | 7:38 AM

Petrol, Diesel Prices: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఏడో రోజు కూడా బ్రేక్ పడింది. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చివరగా గత శనివారం నాడు ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఆదివారం నుంచి నేటి వరకు ఆ ధరల పెరుగుదలకు బ్రేక్ వేసింది. ఇది వాహనదారులకు కాస్త ఊరట కలిగించినా.. భారంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటేసింది. గతంలో వందలోపు ఉన్న ధరలు.. రోజురోజుకు పెరుగుతూ వంద దాటేయడంతో వాహనదారులకు బారంగా మారిపోయింది. వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. కాగా, వరుసగా పెరిగిన ధరల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 దాటింది. ప్రతి రోజు పెట్రోల్‌, డీజిల్‌పై 29 నుంచి 30 పైసలు పెరుగుతూ వస్తున్న ధరలు.. గత ఏడు రోజులుగా నుంచి ధరలు నిలకడగా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

► న్యూఢిల్లీ – లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.84 ఉండగా, డీజిల్‌ ధర రూ. 89.87 ఉంది.
► ముంబై – లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.83 ఉండగా, డీజిల్‌ ధర రూ. 97.45.
► కోల్‌కతా- పెట్రోల్‌ ధ రూ. 102.08, డీజిల్‌ ధర రూ. రూ. 93.02
► చెన్నై – పెట్రోల్‌ ధర రూ. 102.49, డీజిల్‌ ధర రూ. 94.39.
► బెంగళూరు – పెట్రోల్‌ ధర రూ. 105.25, డీజిల్‌ ధర రూ. 95.26
► భోపాల్‌ – పెట్రోల్‌ ధర రూ.110.20, డీజిల్‌ ధర రూ.98.67.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్ – పెట్రోల్‌ ధర రూ. 105.83, డీజిల్‌ ధర రూ. 97.96
► మెదక్ – పెట్రోల్‌ ధర రూ. 106.30, డీజిల్‌ ధర రూ. 98.40.
► వరంగల్ పెట్రోల్‌ ధర రూ. 105.38, డీజిల్‌ ధర రూ. 97.52.
► విజయవాడ – పెట్రోల్‌ ధర రూ.108.11, డీజిల్‌ ధర రూ.99.70
► విశాఖపట్నం – పెట్రోల్‌ ధర రూ. 107.07, డీజిల్‌ ధర రూ.98.86,
► విజయనగరం – పెట్రోల్‌ ధర రూ.108.34, డీజిల్‌ ధర రూ.99.86

ఇవీ కూడా చదవండి

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్

Yamaha FZ25: యమహా ఎఫ్‌జెడ్ 25 మోటో జీపీ ఎడిషన్ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!