Fuel price today: తగ్గేదేలే..! దూసుకుపోతున్న పెట్రో ధరలు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

|

Jun 10, 2021 | 7:45 AM

Petrol, Diesel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో

Fuel price today: తగ్గేదేలే..! దూసుకుపోతున్న పెట్రో ధరలు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..
Petrol-Price-Today
Follow us on

Petrol, Diesel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై 80 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా పెరిగిన ధరలతో.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.95.66 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.47 కి చేరింది.
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.101.7, డీజిల్ రూ.93.85 కు పెరిగింది.
చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.94 ఉండగా.. డీజిల్‌ రూ.91.15 గా ఉంది.
కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.52గా.. డీజిల్‌ ధర రూ.89.32 గా ఉంది.
బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.75 డీజిల్‌ రూ.91.67 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.69 గా ఉండగా.. రూ. 96.04 గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 100.49 ఉండగా.. డీజీల్ ధర రూ.94.88 గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.31, లీటర్‌ డీజిల్‌ రూ.94.26 కు పెరిగింది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.02, డీజిల్ ధర 93.98 గా ఉంది.

Also Read:

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. పెరగని ధరలు… దేశీయ మార్కెట్లో స్థిరంగా గోల్డ్ రేట్స్..

Building Collapsed: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. 9 మంది మృతి..